తెలుగు ఇండస్ట్రీలో సమంత (samantha)ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఏ మాయ చేసావే సినిమాతో మంచి మార్కులు వేయించుకుంది. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత వరుసగా చాలామంది స్టార్ హీరోలు సమంతని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే సమంత నటించిన అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీ అయినా అక్కినేని(akkineni) ఇంటికి కోడలుగా వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది.

నాలుగు సంవత్సరాలు నాగచైతన్య సమంత ఎంతో అన్యాయంగా ఉండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ విషయం లో అక్కినేని అభిమానులతో పాటు చాలామంది సెలబ్రిటీలు నెటిజెన్స్ అందరూ షాక్ అయ్యారు. ఇంత మంచి జంట విడాకులు తీసుకోబోతున్నారా?అంటూ బాధపడ్డారు. ఇక విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించాక ఎవరి దారి వారు చూసుకొని సినిమాల్లో బిజీ అయిపోయారు

. విడాకుల తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.అయితే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. అంతేకాకుండా సినిమాల కోసం అతిగా కష్టపడి మయాసైటిస్(mayositis) అనే వ్యాధి బారిన పడింది. ఇక ఆ వ్యాధి నుండి కోలుకోవడానికి ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆ వ్యాధి నయం కాకపోవడంతో దక్షిణ కొరియా(south koria)కి వెళ్ళింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. దక్షిణ కొరియా నుండి రాగానే నాగ చైతన్య సమంతను కలవబోతున్నాడట.

ఈ విషయంలో నాగచైతన్య(nagachaithanya) ముందుగానే సమంత మేనేజర్ కి చెప్పడంతో ఆయన సమంతకు తెలిపారట. ఇక నాగచైతన్యను కలవడానికి సమంత కూడా ఓకే చెప్పిందట. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు కలుసుకోబోతున్నారు? అని చాలామంది నెటిజన్స్ లో అనుమానాలు మొదలయ్యాయి. అసలు వీళ్లు అధికారికంగా విడాకులు తీసుకున్నారా? లేక మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి ఆలోచనలో ఉన్నారా?అనే ప్రశ్నలు నెటిజన్స్ లో తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *