Apsara Rani: RGV కంపెనీ నుంచి మరో హాట్ బాంబ్ అప్సర రాణి | వినోదం News in  Teluguసినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని చాలామంది హీరోయిన్లు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో మన వ్యక్తిత్వం పై క్యాస్టింగ్ కౌచ్ ఆధారపడి ఉంటుందని కొంతమంది చెబుతుంటే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడాల్సిందే అని నిర్మొహమాటంగా చెబుతున్నారు మరికొంతమంది. ఇకపోతే ఏకంగా రమ్యకృష్ణ ,అనుష్క, కాజల్ లాంటి వారు కూడా అవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే అంటూ పచ్చిగా మాట్లాడుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు సీనియర్ హీరోయిన్లే కాస్టింగ్ కౌచ్ పై ఇలా స్పందిస్తుంటే ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లకు ఏం సందేశం ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదిలా ఉండగా తాజాగా.. ఈ క్యాస్టింగ్ కౌచ్ పై మరొక హీరోయిన్ స్పందించడం జరిగింది. లైంగిక చర్యకు పాల్పడుతూనే అవకాశాలు ఇస్తామని.. హీరోయిన్ చేస్తామని కూడా అన్నారని ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు .. థ్రిల్లర్ , డేంజరస్ వంటి వర్మ సినిమాల ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకున్న గ్లామర్ బ్యూటీ అప్సరా రాణి. కెరియర్ మొదట్లో కన్నడ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక చేదు అనుభవాన్ని ఇటీవల బయటపెట్టింది అప్సరా రాణి.

కన్నడలో ఒక సినిమాలో హీరోయిన్గా ఆఫర్ వచ్చిందని.. అయితే ఆ సినిమా డిస్కషన్ కోసం డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడని చెప్పింది. తీరా అక్కడికి వెళ్ళాక తన కోరిక తీరిస్తేనే సినిమాలో అవకాశం ఇస్తానని బెదిరించాడని.. కానీ తాను వాళ్ళ నాన్నతో వెళ్ళానని.. అక్కడ పరిస్థితి అర్థం కావడంతో పారిపోయి వచ్చేసాము అని కూడా చెప్పుకొచ్చింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో తనకు ఇలాంటి వేధింపులు ఎప్పుడు ఎదురు కాలేదని స్పష్టం చేసింది.

తెలుగులో మంచి టాలెంట్ ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయని తెలిపింది. ఒక సినిమా క్లిక్ అయితే చాలు అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇండస్ట్రీ తో సంబంధం లేదు.. టాలెంట్ ఉన్నవారికి తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారు అంటూ తెలుగు ప్రేక్షకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వర్మ హీరోయిన్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *