నందమూరి తారక రామారావు (NTR)అలాగే అక్కినేని నాగేశ్వరరావు(AKKINENI NAGESHWAR RAO) ఇద్దరూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళలాంటివారు. వీరిద్దరూ తమ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ రేంజ్ కి తీసుకెళ్లి పెట్టారు.. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ పై అప్పట్లో మిగతా ఇండస్ట్రీ వాళ్ళు చాలా చిన్నచూపు చూసేవారు. కానీ ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో తెలుగు సినిమా అంటే ఏంటో తెలుగు భాష అంటే ఏంటో వారికి అర్థమయ్యేలే చేశారు. ఇక అప్పట్లో ఈ ఇద్దరు హీరోలు సినిమాల పరంగా చాలా పోటాపోటీగా కనిపించేవారు.

కానీ బయట వీళ్ళు చాలా మంచి స్నేహితులు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే అప్పటి జనరేషన్ నుండి ఇప్పటి జనరేషన్ వరకు చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఇప్పటికి కూడా చాలామంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు. వెంకటేష్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) వెంకటేష్, వరుణ్ తేజ్ వెంకటేష్, ఇలా చాలామంది మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు.

అయితే అప్పట్లో కలిసి నటించిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లలాగే వారి కొడుకు లైన నాగార్జున(NAGARJUNA),బాలకృష్ణ లతో కూడా గుండమ్మ కథ(GUNDAMMA KATHA) ని ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించాలని భావించారట. కథలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం నటీనటులను మాత్రమే మార్చి సినిమా తీద్దామని భావించారట. కానీ గుండమ్మ కథ పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే పాత్ర సూర్యకాంతం. ఇక ఈ పాత్ర నే సినిమాకి హైలెట్. అయితే ఈ సినిమాలో సూర్యకాంతం పాత్ర చేయడానికి బాలకృష్ణ (BALAKRISHNA)చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులను దాదాపు నెలకు పైగా స్క్రీన్ టెస్ట్ నిర్వహించి వెతికారట.

కానీ ఏ ఒక్కరు కూడా సూర్యకాంతం పాత్రలో కనీసం 2% కూడా చేయలేకపోయారట. ఇక సూర్యకాంతం పాత్ర ఎవరు చేయలేకపోయినందువల్ల ఈ సినిమా అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే గుండమ్మ పాత సినిమాలో సూర్యకాంతం(SURYAKANTHAM) పాత్ర హైలెట్ కాబట్టి అలాంటి హైలెట్ పాత్రను తీసేస్తే ఎలా ఉంటుంది అని భావించి నాగార్జున బాలకృష్ణ ఆ మల్టీ స్టారర్ సినిమాలో నటించడం మానేశారు.ఇక అక్కడితో ఆ సినిమాకి పులిస్టాప్ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *