తెలుగు ఇండస్ట్రీలో మహానటి(MAHANATI)గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం,అభినయంతో అప్పట్లో హీరోలకు పోటీగా పారితోషికాన్ని అందుకునేది. అలాంటి సావిత్రమ్మ జీవితం అలా నాశనం అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సావిత్రమ్మ ఆవేశంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. అందులో మొట్టమొదటిది చిత్ర నిర్మాణం. రెండవది జెమినీ గణేషన్(JEMINI GANESHAN) చేసిన అప్పులకు షూరిటీ సంతకాలు పెట్టడం.

మూడవది చేతికి ఎముక లేకుండా ఉన్నదంతా దానధర్మాలు చేయడం. నాలుగవది వాగ్దానాలు చేయడం వాటిని నిలబెట్టుకోవడానికి పడరాని పాట్లు పడటం. ఇలా ఎన్నో రకాలుగా ఒంటరిది అయిపోయింది మహానటి సావిత్రి. ఆమె జీవితంలో మొట్టమొదటి షాక్ రాజమహల్ లాంటి ఆమె ఇంటిని ప్రభుత్వం సీజ్ చేయడం. ఆ తర్వాత ఆమె ఎక్కడుందో అటు ఇండస్ట్రీ వారికి ఇటు మిగిలిన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ తెలియదు. సముచిత సలహాలు ఇచ్చేందుకు ఏ ఒక్కరు ఆమెకు తోడుగా లేకపోవడం ఆమె దురదృష్టం.

ఆ టైంలోనే సావిత్రి(SAVITHRI) గారి మీద కావలసినంత దుష్ప్రచారం జరిగింది. అది చూసి మనసు వికలమైపోయిన సావిత్రమ్మ ప్రచారంలో ఉన్న వార్తలు నిజం చేయడానికి సాహసించింది. సావిత్రమ్మకు సినిమాలు దూరం అయిపోయాయి. ఆమెను కనీసం పలకరించే దిక్కు కూడా లేదు. ఉన్న ఆస్తులను, షీల్డ్ లను,పట్టు చీరలు,వెండి బంగారు బహుమతులను కరిగించడం మొదలుపెట్టింది. కోట్లన్నీ పోయాయి. సావిత్రమ్మ చివరికి అన్నా నగర్ లో ఓ మారుమూల చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయింది.

ఊరికి దూరంగా విసిరి వేయబడ్డ ఆ ఇంట్లో పలకరించే దిక్కులేదు. అయినా కూడా అభిమానుల అనుబంధం తగ్గలేదు. అన్ని కష్టాల్లో సావిత్రమ్మ ఉన్నా కూడా తనకోసం వచ్చే వారికి కడుపునిండా అన్నం పెట్టి దారి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేది. ఒకవేళ తన దగ్గర డబ్బులు లేకపోతే ఓ పట్టు చీర ఇచ్చి దాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బుని తీసుకోమని చెప్పేది. అలా చేతికి ఎముక లేకుండా అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా సహాయం చేసేది. ఇలా తాను చేసిన దానధర్మాల వల్ల చివరికి ఒక్క రూపాయి కూడా లేకుండా దీనస్థితిలో కన్ను మూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *