Akshay Kumar
Akshay Kumar

ఇప్పటివరకు ఎన్నో మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్షయ్ కుమార్ (Akshay Kumar) మరోసారి చారిత్రాత్మక పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పృద్విరాజ్ చౌహన్ (Prudhviraj Chouhan) పాత్ర లో మెరిసిన ఈ హీరో ఇప్పుడు ఛత్రపతి శివాజీ (Chatrapathi Shivaji) గా నటించడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమా కి మహేష్ మంజ్రేకర్ (Mahesh manjrekar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కి వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్ సౌత్ అనే టైటిల్ ను నిర్ణయించారు. పలు సినిమాలలో నటుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఈ సినిమాను చేయడం విశేషం. తెలుగు లో కూడా అయన పలు సినిమాలలో నటించాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

అయితే ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర్నుంచి సోషల్ మీడియా లో అక్షయ్ కుమార్ ను ట్రోల్ చేస్తున్నారు. పృథ్వి రాజ్ చౌహన్ సినిమా కమర్షియల్ గా ఏమాత్రం హిట్ అవ్వలేదు. కనీసం బజ్ కూడా లేదు. ఓ మంచి సినిమా కిల్ అవడం వెనుక అక్షయ్ కుమార్ కారణం అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అంత మంచి సినిమా ను చెడగొట్టిన అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సినిమా ను చేయడం తమకేమాత్రం ఇష్టం లేదని, వేరే హీరో ఈ సినిమా చేస్తే మంచిది అని వారు చెబుతున్నారు. మరి అక్షయ్ కుమార్ ఈ విమర్శలకు సమాధానం చెప్పాలంటే ఈ సినిమా తో హిట్ కొట్టాల్సిందే. ఇంకా హేరా ఫెరి3 (Herapheri3) సినిమా లో కూడా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఏడాదికి దాదాపు అరడజను సినిమాలైనా విడుదల చేస్తుంటాడు అక్షయ్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *