checkdm-trending-in-twitter-ntr-ram-charan
checkdm-trending-in-twitter-ntr-ram-charan

సోషల్ మీడియా లో ఫ్యాన్స్ మధ్య జరిగే వార్స్ ఏ స్థాయి లో ఉంటుందో అందరికి తెలిసిందే. తమ హీరో గురించి ఎంతదూరమైనా వెళ్లే ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఇప్పుడు ఓ విచిత్రమైన హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. #checkdm అనే పేరుతో టాలీవుడ్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య వార్ జరుగుతుంది.

దీనికి కారణం మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అని చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న ఓ సినిమా కు ఎన్టీఆర్ వాయిస్ అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ ఇద్దరి హీరో ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ సాయి ధరమ్ తేజ్ సినిమాలకు గతంలో అతిధిగా వచ్చాడు. జవాన్ సినిమా ఓపెనింగ్ కి వచ్చిన ఎన్టీఆర్ వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా ఈవెంట్ కి కూడా వచ్చాడు.

ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు ఎన్టీఆర్ సాయి ధరమ్ తేజ్ సినిమా కి వాయిస్ అందిస్తున్నాడు. అంతేకాదు ఈ గ్లిమ్ప్స్ కూడా రేపు విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి థాంక్స్ చెబుతూ సాయి ధరమ్ తేజ్ ఓ పోస్ట్ చేశాడు. అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ అని మెన్షన్ చేయగా అలా మెన్షన్ చేసినందుకు మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్ ను కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ కోసం ఇద్దరు హీరో ల అభిమానులు తెగ కొట్టేసుకుంటూ ఉంటారు. అలాంటిది మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్ ను ఆ ట్యాగ్ తో మెన్షన్ చేయడం వారికీ నచ్చలేదు. దానికి తోడు రామ్ చరణ్ మేనేజర్ శివ చెర్రీ కూడా చెక్ డీఎమ్ అని పోస్ట్ చేయడం అప్పటికే సాయి ధరమ్ తేజ్ ఆ ట్వీట్ ను ఎడిట్ చేయడం జరిగింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు #checkdm ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇది దేనికి దారి తీస్తుందో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *