టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఆ అంచనాలకు దక్కినట్లుగా సినిమా హిట్ అవ్వలేదు అనే చెప్పాలి. మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఈ సినిమా కు రెండో రోజు కలెక్షన్స్ తగ్గాయి. దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

కట్ చేస్తే.. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌తో లైగర్ చిత్ర నిర్మాతలు భారీగా నష్టపోయారని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఇక ఓటీటీలోనూ ఈ సినిమాకు అంతంతమాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యింది.డిసెంబర్ 11 తేదీన స్టార్ మా లో ఈ సినిమా రాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *