2015: Forgettable Year for Akkineni Heroes | cinejosh.comటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరో అక్కినేని నాగేశ్వరరావుకు వున్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతోనే ప్రేక్షకులను మెప్పించి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మూల స్తంభంగా నిలిచారు. ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన ఈయన తర్వాత వారసడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి .. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తర్వాత అక్కినేని నాగార్జున కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఇద్దరూ కూడా హీరోలుగా ఇండస్ట్రీలలో అడుగు పెట్టి మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో పాటు కొడుకులు చైతన్య, అఖిల్ కూడా సినిమాలలో దూసుకుపోతూ ఉండడం గమనార్హం.

ఈ ముగ్గురు అక్కినేని హీరోలు చేసిన పనికి టాలీవుడ్ డైరెక్టర్లు షాక్ లో ఉండిపోయారు. టాలీవుడ్ లో డైరెక్టర్లు లేనట్టుగా ముగ్గురు కూడా తమిళ దర్శకులతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరు ముగ్గురు కూడా తమ తదిపరి సినిమాలను తమిళ దర్శకుల చేతిలోకి పెట్టడంతో.. నిజానికి వీరు ముగ్గురు మాట్లాడుకొని ఇలా చేశారా ? లేక యాదృచ్ఛికంగా అలా జరిగిందా ?అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ది గోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రేక్షకులను అలరించలేకపోయాడు. అందుకే ఈ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తో కలసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరొకవైపు అక్కినేని నాగచైతన్య విషయానికి వస్తే.. ఇటీవల థాంక్యూ సినిమా ద్వారా ఫ్లాప్ అందుకున్న అక్కినేని నాగచైతన్య కూడా తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడుతో కలిసి చేస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాగచైతన్య హీరోగా , కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అక్కినేని అఖిల్ కూడా తమిళ దర్శకుడు పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈయన నటించిన ఏజెంట్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మరొక సినిమా కోసం తమిళ్ దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ముగ్గురు ఇలా ఒకే కుటుంబానికి చెందినవారు తమిళ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంతో టాలీవుడ్ డైరెక్టర్లు వీరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి తమిళ దర్శకుల సినిమాలతో వీరు.. హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *