శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చినా పెళ్లి సందD(PELLI SANDADI) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల. ఇక తండ్రి సినిమా టైటిల్ ని తన మూవీ కి టైటిల్ గా పెట్టుకొని మంచి హిట్ ని కొట్టాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. ఇక ఈ సినిమాకి కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ద్వారా తన నటన కి మంచి మార్కులు వేయించుకుంది హీరోయిన్ శ్రీలీల. ఇక మొదటి సినిమాతోనే వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీ లీల 2001 జూలై 14న యునైటెడ్ స్టేట్లో పుట్టింది. శ్రీలీలా తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయే. ఈమె ముందుగా కన్నడ ఇండస్ట్రీలో కిస్, భారతే అనే సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పెళ్లి సందD సినిమా ద్వారా మన ముందుకు వచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో దాదాపు నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మధ్యనే రవితేజ సరసన ధమాకా(DHAMAKA) సినిమాలో నటించింది.ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

అయితే శ్రీ లీలకి చాలా మంచి మంచి ఆఫర్లు రావడంతో ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ హీరో కూడా తన సినిమాలో శ్రీ లీల ను హీరోయిన్గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఇక ఈ విషయాన్ని శ్రీలీలా (SRILEELA)కు చెప్పడంతో స్టార్ హీరో సినిమా కదా అని ఒప్పుకుందట. కానీ ఆమె ముందే ఒప్పుకున్న ఓ సినిమా ప్రాజెక్టుకి కాల్షీట్లు అడ్జస్ట్ కావడం లేదు అంటూ ఆ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకొని నేరుగా డైరెక్టర్ కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పిందట. అంతేకాదు కొన్ని మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమాని నేను చేయలేకపోతున్నాను అంటూ డైరెక్టర్ కి చెప్పిందట.

ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక డైరెక్టర్ నేరుగా హీరో కి ఫోన్ చేసి చెప్పడంతో ఆ హీరో శ్రీలీలా కు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఇంతకీ శ్రీలీలా ను ఆ హీరో ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంతగానో కష్టపడాలి. అన్ని విషయాల్లో ఓపిగ్గా ఉంటేనే స్టార్ హీరోయిన్ అవ్వగలవు. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. లేకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఒక పదో, పదిహేనో సినిమాలు చేసి కనుమరుగైపోతావ్.. అంటూ శ్రీలీలకు ఆ స్టార్ హీరో చెప్పారట. ఇక శ్రీ లీల ఆ స్టార్ హీరో చెప్పిన మాటల్ని ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *