టాలీవుడ్ యంగ్ అండ్ వర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్(satya dev) హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `గుర్తుందా శీతాకాలం`. కన్నడ నటుడు మరియు డైరెక్టర్ అయిన నాగశేఖర్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మేఘ ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని తదితరులు కీలక పాత్రను పోషించారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కాలభైరవ(kalabhairava) సంగీతం అందించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా ఏదో ఒక కారణం చేత రిలీజ్ కు వరుస అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. గ‌ట్టిగా ప్రమోషన్స్ చేస్తే సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ అవుతుంది.

ముఖ్యంగా తమన్నా ప్రమోషన్స్ లో భాగమైతే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంది. కానీ తమన్నా ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. స‌త్యదేవ్, మేఘా అకాష్‌, ద‌ర్శ‌క‌నిర్మాత‌లే త‌మ వంతు సినిమాపై బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక‌ విడుదలకు మరో నాలుగు రోజుల సమయం మాత్ర‌మే ఉంది. అయినాసరే తమన్నా ఈ సినిమాను పట్టించుకోవడం లేదు. ఇక సరైన పబ్లిసిటీ కార్యక్రమాలు లేకపోవడంతో గుర్తుందా శీతాకాలం(gurthunda seethakalam)ను ప్రేక్షకులు గుర్తుంచుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప‌లువురు సినీ ప్రియులు మరియు నెటిజ‌న్లు తమన్నా(tamannaah)పై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. నీకు అసలు బుద్ధుందా.. లేదా..? విడుదలకు ఇంకా కొద్దిరోజులే సమయం ఉన్నా ఎందుకు గుర్తుందా శీతాకాలం ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు..? అదే పెద్ద హీరో సినిమాకు అయితే ఇలా చేస్తావా..? అంటూ ఆ రేంజ్ లో ఏకేస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్ర‌మోష‌న్స్ లో తమన్నా యాక్టివ్ అవుతుందా..? లేదా..? అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *