ప్రముఖ నటుడు ఎల్బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది బయటకు ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తున్నా కూడా కొన్ని సమయాలలో మానసిక రుగ్మతకు లోనవుతుంటారు. అయితే అది సామాన్యులే కావచ్చు.. సినీ రాజకీయ సెలబ్రిటీలైనా కావచ్చు.. అయితే ఎవరి విషయంలో అయినా సరే ఇలాంటి ఎన్నో సమస్యలు మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ కూడా కమెడియన్ గా మరింత పేరు తెచ్చుకున్నారు. కేవలం తన కామెడీతోనే కాదు ఎన్నో సినిమాలలో కన్నీళ్లు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న.. ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటినుంచి నాకు తరచూ ఒక కల వచ్చేది.. నేను చనిపోతే నా స్నేహితులు నా పాడే మోయడమే ఆ కల.. నెలకి ఒకసారి అయినా ఆ కల రావడం నిజంగా చిత్రంగా అనిపించినా.. భయంతో నా ప్రాణాలు పోయినట్టు అనిపించేది అంటూ తెలిపారు ఎల్బీ శ్రీరామ్. ఆయన మాట్లాడుతూ.. నన్ను మా ఊళ్లో భద్రాద్రి అని పిలిచేవారు. అయితే నేను చనిపోయిన తర్వాత మా స్నేహితులు.. మా అమ్మ దగ్గరకు పాడే మోసుకొని రావడం చూసి.. మా అమ్మ అప్పుడే వెళ్లడమేంటి నాలుగు రోజులు ఉండొచ్చు కదా.. అనడం.. అక్కడ నా పాడెమోసే వాళ్ళు తొందర పెడుతున్నారమ్మ.. నేను వెళ్లి పాడిపై పడుకోవాలి.. అని చెప్పగానే వెంటనే మెలకువ వచ్చి చుట్టూ చూస్తే ఎవరూ లేకపోవడం ఇలా ఎన్నోసార్లు నా జీవితంలో జరిగింది.

అయితే ఇలా ఈ పిచ్చి కల వచ్చినప్పుడు ఎలా తలుచుకుంటే ఒక్కోసారి భయం కూడా వేస్తుందని తెలిపారు. ఎల్పి ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. రచయితగా , నేను ఇవివి సత్యనారాయణ గారికి బాగా తెలుసు. అయితే ఆయన నాకు, నటుడిగా ఛాన్స్ ఇస్తారా లేదా అన్న సందేహంతోనే వెళ్లాను. ఆ తర్వాత చాలా బాగుంది అనే సినిమాలో నాకు వేషం ఇచ్చారు. ఆ వేషం నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత నటుడిగా నేను మళ్ళీ వెనతిరిగి చూసుకోలేదు.

ఆ సినిమాలో నా వేషం, యాస తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అప్పటినుంచి ఎల్బీ శ్రీరామ్ మంచి కమెడియన్ అంటూ.. ఇక అందరికీ నన్ను పరిచయం చేశారు. ఆయన చేసిన మేలు నా జీవితంలో మర్చిపోలేను అంటూ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *