నట‌సింహం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ ఎంటర్టైనర్ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియ‌ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపోడి(anil ravipudi)తో ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. బాల‌య్య‌కు ఇది 108వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇటీవల అఫీషియ‌ల్ గా ప్రకటించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్‌ బ్యూటీ శ్రీలీల ఎంపిక అయిందని ఇప్పటికే అనిల్ రాయపూడి స్పష్టం చేశారు.

బాలయ్యకు జోడిగా బాలీవుడ్ గ్లామర్ డాల్‌ సోనాక్షి సిన్హా(sonakshi sinha) నటించబోతుందని ప్రచారం జరిగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని రీసెంట్ గా సోనాక్షి సిన్హా క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా బాలయ్యకు జోడీగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియాంక జవల్కార్. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన `టాక్సీవాలా` సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రియాంక గ్లామర్ పరంగా మరియు నట‌న‌ పరంగా మంచి మార్కులు వేయించుకుంది.

ఇక ఆ తర్వాత గమనం, ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మ‌రుసు చిత్రాల్లో మెరిసింది. కానీ ఈ సినిమాలు ఏవి ప్రియాంకకు సక్సెస్ అందించలేకపోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆఫర్ల కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తుంద‌ట‌. ఇలాంటి త‌రుణంలో బాలయ్య‌కు జోడిగా నటించే అవకాశం రావడంతో.. వెంటనే ఓకే చెప్పిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ షురూ చేశారు. కూతురు వయసు ఉన్న‌ ప్రియాంకతో బాలయ్య రొమాన్సా..? ఇదేం కాంబినేషన్ రా సామి.. అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మరి నిజంగానే బాలయ్యకు జోడిగా ప్రియాంక జవల్కార్(priyanka jawalkar) సెట్‌ అయిందా లేదా అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *