Keerthi Suresh in Bollywoodప్రముఖ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె తల్లి మేనక ప్రముఖ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది . ప్రస్తుతం తన తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన కీర్తి సురేష్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది ఇదిలా ఉండగా తెలుగులో మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మెప్పించింది. తెలుగు, తమిళ్ చిత్రాలలో వరుసగా నటించి భారీ పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఏ రోజు కూడా గ్లామర్ వొలకబోయలేదు గ్లామర్ షో చేస్తే తప్ప కమర్షియల్ గా హిట్ సాధించలేము అని తెలిసినప్పటికీ మొన్నటి వరకు పద్ధతిగా పాత్రలు చేస్తూ సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మాత్రం గ్లామర్ షో చేస్తోందని చెప్పాలి.

తోటి హీరోయిన్లతో పోటీ పడుతూ గ్లామర్ విషయంలో తెగ రెచ్చిపోతోంది. అందాలను ప్రదర్శిస్తూ.. మాస్ స్టెప్స్ తో మరింతగా తనకు సంబంధించిన డాన్స్ వీడియోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది. అయితే ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో తన గ్లామర్ షోను ప్రపంచానికి పరిచయం చేసిన ఈమె ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక గ్లామర్ షో తో పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.. ఇంటర్వ్యూలో భాగంగా మీకు కాస్టింగ్ కౌచ్ ఎదురయిందా? ఒకవేళ కమిట్మెంట్ ఇస్తేనే మీకు హీరోయిన్ అవకాశం ఇస్తాము అని చెప్పినప్పుడు.. మీ సమాధానం ఏంటి? అంటూ కీర్తి సురేష్ కి ప్రశ్న ఎదురయింది. అయితే ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను వెల్లడించింది. అవసరం అయితే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను.. కానీ ఆ పని మాత్రం చేయను అంటూ తెలిపిన ఈమె క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉందని నాకు కూడా తెలుసు. నాతో నటిస్తున్న చాలామంది ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు.

వారిలో చాలామందికి ఆ ఇబ్బంది ఏంటో తెలుసు.. అయితే నా వరకు అది ఎదురు కాలేదు. మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి అన్ని ఉంటాయి. ఒకవేళ నిజంగా నాకు కాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఎదురై ఉంటే మాత్రం చచ్చిన నేను సినిమాలు చేసేదాన్ని కాదు సినిమాలు ఆపేసుకొని వేరే జాబ్ చూసుకునే దానిని. అంతేకానీ నా కమిట్మెంట్స్ కోసం నేను కమిట్మెంట్ ఇచ్చి.. ఇతరులను కమిట్ చేయను అంటూ ఘాటుగా స్పందించింది కీర్తి సురేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *