ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(keerthi suresh) పెళ్లి చేసుకోబోతుందని గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కు తగిన వరుడిని ఆమె పేరెంట్స్ చూశారని.. అతడు కీర్తి సురేష్ కు కూడా నచ్చడంతో పెళ్లికి వెంటనే ఓకే చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పెళ్లి నిశ్చయం అవడం వల్లే కీర్తి సురేష్ కొత్త సినిమాలు అంగీకరించడం లేదని, ఒప్పుకున్న ప్రాజెక్టులను త్వ‌ర‌త్వరగా కంప్లీట్ చేసి వివాహం అనంతరం నటనకు బై బై చెప్పాలనుకుంటుందని కూడా ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్ ఓ కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన పెళ్లి వార్త పుకారే అని పరోక్షంగా స‌మాధానం ఇచ్చేసింది. ఆమె సన్నిహితుల సైతం కీర్తి పెళ్లి వార్తలు ఫేక్ అని.. కావాల‌నే కొంద‌రు క్రియేట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇక కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే..

ప్రముఖ రైటర్‌ సుమన్‌ కుమార్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్ ఓ లేడీ ఓరింయెటెడ్‌ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకు `రఘు తథా(raghu thatha)` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `కేజీఎఫ్`, `కాంతార‌` సినిమాల‌తో ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్ నిర్మితం కాబోతోంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

ఈ సినిమాకు కాకుండా కీర్తి సురేష్ చేతిలో మ‌రో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వాటిలో న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కుతున్న ఊర మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా(dasara)` ఒక‌టి. అలాగే మెగాస్టార్ చిరంజీవికి సోద‌రిగా `భోళా శంక‌ర్‌` సినిమాలో నటించేందుకు సైన్ చేసింది. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక కోలీవుడ్ లో కీర్తి ఉద‌య్‌నిధి స్టాలిన్ కు జోడీగా ఓ సినిమా, జ‌యంర‌వి స‌ర‌స‌న ఓ సినిమా చేసేందుకు క‌మిట్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *