Jabardasth Pavithra: జబర్దస్త్ కామెడీ షోలో ఈ పవిత్ర ఎవరు.. ఆ అమ్మాయి  బ్యాగ్రౌండ్ ఏంటి..? | Jabardasth Comedy Show here the interesting details  of lady comedian Pavithra pk– News18 Teluguజబర్దస్త్ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది కమెడియన్ల జీవితాల వెనుక ఎన్నో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఇవన్నీ వారే స్వయంగా చెప్పే వరకు చాలామందికి తెలియదనే చెప్పాలి. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అతి కొంతమంది వాళ్ళల్లో పాగల్ పవిత్ర కూడా ఒకరు. మొదట టిక్ టాక్ వీడియోలు చేసుకునే ఈమె జబర్దస్త్ లోకి వచ్చాక బాగా పాపులారిటీని దక్కించుకుంది. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకుంటోంది. పవిత్ర లోకేష్ పొట్టిగా ఉన్నప్పటికీ గట్టి పిండమని చెప్పవచ్చు. పురుషులతో పోటీ పడుతూ మంచి కామెడీ టైమింగ్ తో అలరిస్తోంది.

జబర్దస్త్ లోకి వచ్చాక బాగా పాపులర్ అయింది పవిత్ర.. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకుంటుంది.బుల్లెట్ భాస్కర్ , హైపర్ ఆది ,మంకీ వెంకీ టీమ్స్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తోంది. ఇకపోతే కెరియర్ ఆరంభంలో కొన్ని సీరియల్స్ లో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.దాంతో జబర్దస్త్ లోకి వచ్చింది . ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా తన జాతకాన్ని మార్చుకున్న ఈమె బుల్లితెర కార్యక్రమాలలో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈమె జీవితంలో ఎవరికీ కనిపించని కన్నీటి గాధలు ఉన్నాయి.

కొన్నేళ్ల క్రితమే తండ్రి కన్నుమూశాడు.తల్లి ఊర్లోనే ఉంటుంది. తనకున్న బ్యూటీ సెలూన్ ను అమ్మేసి ఇటీవలే ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అయితే ఆ ఇంటికి వాస్తు లేకపోవడంతో ఇప్పుడు కొన్ని మరమ్మత్తులు కూడా చేయిస్తోంది.తండ్రి మరణించడంతో అన్ని తానే అయి కుటుంబ బాధ్యతలను మోస్తున్న పవిత్ర లోకేష్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో అవమానాలను కూడా భరించిన ఈమె కుటుంబ పోషణకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చెబుతూ ఉంటుంది.

తాజాగా తన ఇంటికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసిన పవిత్ర వీడియోలో ముందుగా తన తల్లితో కలిసి తండ్రి చిత్రపటానికి నివాళులర్పించింది. ఆ తర్వాత తమ ఇంట్లో జరుగుతున్న పనుల వివరాల గురించి చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇంత చిన్న వయసులోనే తండ్రి లేకపోయినా ఇంటి బాధ్యతలను భుజాన ఎత్తుకున్న పవిత్ర పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *