అక్కినేని నాగార్జున (nagarjuna)నటవారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ఇక ఈయన మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్డం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన సమంతని ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు తలెత్తి విడాకుల బాట పట్టారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఎప్పుడూ సినిమాలతోనే బిజీగా ఉండే నాగచైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు.

నాగచైతన్య మేనమామ వెంకటేష్ (venkatesh)చిన్న కూతురు అశ్రీత ఫారిన్ లో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఆమె హైదరాబాద్ కి వచ్చింది. ఇక మరదలు తో కలిసి నాగ చైతన్య సందడి చేసే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగచైతన్య కేవలం సినిమాల్లోనే కాకుండా హోటల్ వ్యాపారాన్ని కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి నడుపుతున్నాడనే విషయం చాలామందికి తెలియదు. నాగ చైతన్య ఎక్కువగా జపనీస్ ఫుడ్ ని చాలా ఇష్టంగా తింటారు. ఇక జపానీస్ ఫుడ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేసి తెలుగు వాళ్ళకు రుచి చూపించాలి అనే ఉద్దేశంతో శోయు అనే ఒక కొత్త వంటకాన్ని స్పెషల్ గా డిజైన్ చేశారట.

ఇక ప్రస్తుతం ఈ వంటకం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక నేపద్యంలోనే ఇండియాకి వచ్చిన వెంకటేష్ కూతురు అశ్రీత (ashritha)కూడా నీ స్పెషల్ వంటకం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు మరి అందులో ఎంత స్పెషల్ ఉందో ఎంత రుచిగా ఉందో నేను కూడా ఓసారి ట్రై చేద్దామని ఇక్కడిదాకా వచ్చానంటూ అశ్రీత నాగచైతన్యతో సరదాగా మాట్లాడింది. అంతేకాదు నాగచైతన్య ని బావ బావ అని అశ్రీత చాలా ప్రేమగా పిలవడం చూసిన చాలామంది నెటిజెన్లు నాగచైతన్య ఈమెను రెండో పెళ్లి చేసుకుంటే బాగుండు అంటూ కామెంట్లు రు.

అయితే ఇంతకుముందే నాగచైతన్య(nagachaithanya) వెంకటేష్ కూతురిని రెండో పెళ్లి చేసుకుంటారు అని వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎలాంటి క్లారిటీ  లేదు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని అక్కినేని అభిమానులు భావించారు కానీ అది జరగలేదు .ఇక మరి కొంతమందేమో సమంత గనుక ఈ వీడియో చూస్తే కుళ్ళుకొని చస్తుంది అంటూ సమంత హేటర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *