మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాస్ మహారాజ్‌ రవితేజ, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీలో మత్స్య కారులకు నాయకుడిగా చిరంజీవి కనిపించనున్నాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైతం ఊపందుకున్నాయి. ఇక‌పోతే వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ-గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న `వీర సింహారెడ్డి(veera simha reddy)` సినిమా దిగ‌బోతున్న విధిత‌మే. అలాగే విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన `వార‌సుడు` సినిమా కూడా సంక్రాంతికే వ‌స్తోంది. ఈ రెండు చిత్రాలు జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతున్నాయి.

ఇప్పటి వ‌ర‌కు `వ‌ల్లేరు వీర‌య్య‌(waltair Veerayya)` విడుద‌ల తేదీని అనౌన్స్ చేయ‌లేదు. అయితే జనవరి 10వ తారీఖును వ‌ల్లేరు వీర‌య్య‌కు రిలీజ్ డేట్ గా ఎంచుకుంటే బాగుంటుందని సినీ ప్రియులు మ‌రియు అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ విధంగా చేస్తే రెండు రోజుల పాటు రికార్డ్ స్థాయిలో వాల్తేరు వీరయ్య మూవీకి కలెక్షన్లు వస్తాయి. అలాగే రెండు రోజుల పాటు ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ల‌భిస్తుంది. మ‌రియు టాక్ అనుకూలంగా ఉంటే లాంగ్ వీకెండ్ ను సైతం వినియోగించుకోవ‌చ్చు.

జ‌న‌వ‌రి 10వ తారీఖును రిలీజ్ డేట్‌గా ఎంచుకుంటే ఇవ‌న్నీ `వాల్తేరు వీర‌య్య‌`కు క‌లిసొచ్చే అంశాలు అవుతాయి. దాంతో ఈ సినిమా అదిరిపోయే వ‌సూళ్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలుస్తుంది. మ‌రి ఈ ల‌క్కీ ఛాన్స్ ను `వాల్తేరు వీర‌య్య` మేక‌ర్స్ వాడుకుంటారా..? లేదా..? అన్న‌ది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *