పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అల్లు అర్జున్(ALLU ARJUN) హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ హన్సిక మోత్వాని. ఇక చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదటి సినిమాతోనే తన నటన కి మంచి మార్కులు వేయించుకొని వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు కొట్టేసింది. ఇక ఈమె ఇండస్ట్రీకి వచ్చినా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యాక కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మెల్లిగా అక్కడికి చెక్కేసింది.

దాంతో అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే..చాలా రోజుల నుండి హన్సిక(HANSIKA) పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ ఆమెపై ఎన్ని వార్తలు వస్తున్నా కూడా ఏ ఒక్క రోజు స్పందించకుండా సైలెంట్ గా ఉంటూ ఎవరు ఊహించని విధంగా తన లవర్ ఆమెకు ప్రపోజ్ చేసిన ఒక ఫోటోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ ఒక్క ఫోటో తో ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ అందరిలో క్లారిటీ వచ్చింది. ఇక ఈమె పెళ్లిలో మరొక ఆశ్చర్యం ఏంటంటే..

ఆమె పెళ్లి చేసుకోబోయే భర్తకి అది రెండో పెళ్లి.. అంతేకాదు మొదటి భార్య ఎవరో కాదు హన్సిక స్నేహితురాలే. అలాగే హన్సిక తాను చేసుకోపోయే భర్త మొదటి పెళ్లికి కూడా వెళ్ళింది. ఇక తాజాగా జైపూర్(JAIPOOR) లో అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కారు ఈ నవ దంపతులు. ఇక ఈ పెళ్లిలో చాలా సంప్రదాయ బద్దంగా కనిపించింది హన్సిక.ఇక ఈ విషయం పక్కన పెడితే.పెళ్ళై 24 గంటలు కూడా గడవకముందే హన్సిక షాకింగ్ నిర్ణయం తీసుకుందట.

అంతేకాదు హన్సిక తీసుకున్న నిర్ణయానికి ఆమె భర్త కూడా షాక్ అయ్యాడట. అదేంటంటే..పెళ్లి తర్వాత ఎప్పటిలాగే హన్సిక సినిమా షూటింగుల్లో పాల్గొన బోతుందట. తన సినిమాలకు సంబంధించి అన్నీ పూర్తయ్యాకే హనీమూన్ (HONYMOON)కి వెళ్దామని చెప్పి తన భర్తకి షాక్ ఇచ్చిందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ చాలామంది హన్సికకు సినిమాల మీద చాలానే ఇంట్రెస్ట్ ఉంది అంటూ పొగుడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *