ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. కొంతమందేమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్వారా పేరు తెచ్చుకున్నారు. మరికొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి వారికంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభాస్(PRABHAS).. ఇక ప్రభాస్ అంటే చాలామంది అమ్మాయిలకు పిచ్చి. ఇక తెలుగు ఇండస్ట్రీలో చాలామంది పెళ్లికాని హీరోలు ఉన్నారు.

శర్వానంద్, రామ్ పోతినేని, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, సుశాంత్ ఇలా ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ అమ్మాయిలకు ఏమాత్రం నచ్చడం లేదట. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటుతుంది. అందుకే అమ్మాయిల్లో వీరి క్రేజ్ తగ్గిపోయింది. కానీ తాజాగా అమ్మాయిలకు యంగ్ హీరోలపై క్రేజ్ పెరిగిందట. ఆ హీరోలంటే పడి చస్తున్నారట. ఇంతకీ ఆ యంగ్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అడివి శేష్(ADIVI SESH) సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో నటించినప్పటికీ టాలీవుడ్ లో లవర్ బాయ్ గానే చూస్తున్నారు అమ్మాయిలు. ఈయన లవ్ స్టోరీ కి సంబంధించిన ఒక్క సినిమా తీయకపోయినప్పటికీ ఈయనకు అమ్మాయిల్లో మాత్రం పిచ్చి ఫాలోయింగ్ ఉంది.

అంతేకాదు ఒక్కసారైనా ఈ హీరోని లవ్ స్టోరీ మూవీలలో చూడాలని అనుకుంటున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి దాదాపు పది సంవత్సరాలు దాటుతున్నా కూడా ఈ హీరోకి అంత పేరు రాలేదు. కానీ అతి తక్కువ బడ్జెట్ తో వచ్చిన డీజే టిల్లు సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు సిద్దు జొన్నల గడ్డ(SIDDU JONNALAGADDA). ఈయన ఒక్క సినిమాతోనే అమ్మాయిల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎలా అంటే ఆయన సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఆయన సినిమాలో మాట్లాడిన డైలాగులు పదేపదే మాట్లాడుతూ ప్రతిసారి సిద్దు ను గుర్తు చేసుకుంటున్నారు ఈ తరం అమ్మాయిలు.

అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ ఈ మధ్యనే వచ్చిన జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా అమ్మాయిల్లో క్రేజ్ తెచ్చుకున్నారు మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(NAVEEN POLISHETTY). ఈ సినిమాలో ఈయన చేసిన కామెడీకి చాలామంది అమ్మాయిలు ఫిదా అయ్యారు. తన ఆటిట్యూడ్ తో చాలామంది అమ్మాయిలను అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో విశ్వక్సేన్. చూడడానికి అమాయకుడలా క్లాస్ గా కనిపించినప్పటికీ ఈయన లోపల ఎన్నో మాస్ ఎలిమెంట్స్ దాగి ఉంటాయి. ఇక ఈయన నటించే వరుస సినిమాలు హిట్ అవుతున్నాయి. దాంతో చాలామంది అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు విశ్వక్ సేన్(VISHWAK SEN).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *