Puri Jagannadh confirms Janaganamanaటాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి మరింత అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించిన పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీని సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా అందించారు. ఇకపోతే ఈయన సినీ కెరియర్ లో ఎన్ని సక్సెస్ లు అయితే ఉన్నాయో అన్ని ఫెయిల్యూర్లు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో భారీ విజయాలను అందుకున్న పూరీ జగన్నాథ్ ఆ తర్వాత పూర్తిగా డీలా పడిపోయి భారీ ఫ్లాప్ ని కూడా చవి చూశాడు. ఇకపోతే చాలామందికి పూరీ జగన్నాథ్ గురించి తెలుసు కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తమ్ముళ్ల గురించి చాలామందికి తెలియదని చెప్పాలి. నిజానికి ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా అడుగు పెట్టిన తర్వాత పూరీ జగన్నాథ్ తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా సక్సెస్ కాలేకపోయారనే బాధ ఎప్పుడూ ఉంటుంది. అయితే పూరీకి రామ్ శంకర్ మాత్రమే కాకుండా ఇంకో తమ్ముడు కూడా ఉన్నారు.

ఈ విషయం చాలామందికి తెలియదని చెప్పవచ్చు. మరో తమ్ముడు పేరు ఉమాశంకర్.. వైసీపీ తరఫున నర్సీపట్నం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.మొదట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత వైసిపి పార్టీలోకి వచ్చారు. 2014లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినా.. 2019లో మాత్రం బంపర్ మెజారిటీతో గెలుపొందారు. రాజకీయంగా తన తమ్ముడు ఎమ్మెల్యే అయినప్పటికీ పూరి జగన్నాథ్ మాత్రం ఏ రోజు తన తమ్ముడి పేరు ఉపయోగించుకోలేదు.Puri Jagannath Petla Umashankar Ganesh: పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా

ఇకపోతే ఇటీవల లైగర్ సినిమాతో మరొకసారి ప్లాప్ ను చూసిన పూరీ జగన్నాథ్ ఒక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *