చంద్రమోహన్‌ ఒడిలో నిద్రపోయిన శ్రీదేవి..!ఇప్పుడంటే ఒక సినిమా చేయాలంటే కోట్లకు కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు. కానీ నాటి రోజుల్లో అలా ఉండేది కాదు.. ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసినా సరే చాలా తక్కువ మొత్తం వచ్చేది. దాంట్లోనే కుటుంబాన్ని చూసుకుంటూ సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నాటినటీనటులంతా అరకొరగా వచ్చే జీతాలతోనే తమ జీవితాన్ని కొనసాగించేవారు.. సంపాదించింది కూడబెడితే దానిని భూములు కొనుగోలు చేయడానికి ఉపయోగించేవారు. ఈ నేపథ్యంలో నాటి హీరోయిన్స్ అందరికీ ఫేవరెట్ హీరో అయిన చంద్రమోహన్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాటి నటీనటులు నష్టపోవడానికి కారణం ఇదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందులో తాను కూడా తెలియక వేల రూపాయలు పెట్టి కొన్న భూములు నేడు కోట్లల్లో పోతున్నాయని చెప్పాడు. అది చూశాక నిజమే అనిపించింది. అప్పట్లో వేల రూపాయలు ఉంటే భూములు.. ఇప్పుడు కోట్లల్లో పలుకుతున్నాయి. ఒక లక్ష రూపాయలు పెట్టి కొంపల్లిలో 15 ఎకరాల భూమిని కొనేస్తే అది ఎవరో ఆక్రమించుకుంటున్నారని భయపెట్టి ఒక వ్యక్తి రూ. ఐదు లక్షలు చేతిలో పెట్టి వెళ్తే నిజమే అనుకొని అమ్ముకున్నాడట చంద్రమోహన్.

అయితే అది కావాలని తమను భయపెట్టి భూములను కొట్టేసారని తెలుసుకొని చంద్రమోహన్ ఆశ్చర్యపోయాడట. ఇలా ఒక్క చంద్రమోహన్ మాత్రమే కాదు నాటి నటీనటులంతా ఇదే పని చేశారు. ఎవరు ఏది చూపించినా నిజమే అనుకొని కొనేవారు. దాంతో కొన్నాళ్ళ కు ఎవరో రావడం.. భయపెట్టడం.. లేదంటే అక్కడ లోకల్ లో ఉండేవారు ఆక్రమించడం.. లాంటివి చేసేవాళ్లు. ఈ తలనొప్పి ఎందుకు అని చవక ధరకే అమ్మేసేవారు నటీనటులు.

బయట వాళ్ళను మోసం చేయడం పెద్దగా కుదరదు కాబట్టి సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తూ మోసం చేసేవారు. ఎందుకంటే వారికి అవన్నీ చూసుకోవడానికి పెద్దగా సమయం ఉండేది కాదు. కాబట్టి ఒకపక్క సినిమాలలో తీరిక లేకుండా షూటింగ్స్ తో బిజీగా ఉంటారు. ఎప్పుడో ఐదేళ్లకి వచ్చేసరికి వారి భూమి ఉందా లేదా అనేది కూడా తెలియకుండా పోతుంది. అలాగే జయసుధ కూడా ఒకసారి 1200 గజాల భూమిని రాత్రికి రాత్రి 20 అడుగుల లోతు లోపలికి తవ్వి మట్టిని అమ్ముకున్నారట. ఎవరో ఫోన్ చేసి వెళ్లి చూసేసరికి ఆ భూమి ఎక్కడ ఉందో కూడా గుర్తు పట్టలేదు. అలా చాలామంది ఆనాటి రోజుల్లో భూములను కోల్పోయారు అంటూ తెలిపారు చంద్రమోహన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *