టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎంతో గుర్తుకు తెచ్చుకున్నారు అల్లు రామలింగయ్య(allu ramalingayya). ఇక ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అల్లు అరవింద్ నిర్మాతగా వచ్చారు. ఈయన మొదట్లో కొన్ని సినిమాల్లో నటించప్పటికీ ఎందుకో అతనికి నటన సెట్ కాదని అనిపించి ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉండే టాప్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ కూడా ఒకరు.

ఇక అల్లు అరవింద్ (allu arvindh)వారసులుగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు హీరోలుగా పరిచయమైతే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి నిర్మాతగా తండ్రి అప్పగించిన భాద్యతలను తీసుకున్నారు. అయితే వీరి ముగ్గురిలో ఎక్కువగా అల్లు అర్జున్ కి అభిమానులు ఉన్నారు. ఇక అల్లు శిరీష్ సినిమాల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా స్టార్డం రావడం లేదు. ఇక అల్లు బాబీ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ గని సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.

కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈయనకు అంత పేరు రాలేదు. అయితే అల్లు బాబీ ఎక్కువగా మీడియాలో కనిపించరు. ఇక తాజాగా బండ్ల గణేష్, అల్లు అరవింద్ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అవేంటంటే.. ఒక ఈవెంట్ లో బండ్ల గణేష్ అల్లు అరవింద్ ఫ్యామిలీతో కలిశారు. అందులో బండ్ల గణేష్(bandla ganesh) సరదాగా అన్నారో లేక కావాలనే వివాదాస్పదంగా మాట్లాడారో తెలియదు కానీ ఆయన మాట్లాడిన మాటలు అల్లు ఫ్యామిలి కి నచ్చడం లేదు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ..అల్లు అరవింద్ గారి మాట వింటే అల్లు బాబీ లా ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. అదే తండ్రి మాట వినకుండా నచ్చింది చేసుకుంటూ పోతే అల్లు అర్జున్ (allu arjun)లా పాన్ ఇండియా హీరో అవుతారు. అందుకే తండ్రి మాట వినకుండా సక్సెస్ బాట పట్టండి అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో దీనిపై అల్లు అరవింద్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *