Nandamuri Balakrishna Confirms Mokshagna's Debut Film - IndustryHit.Comనటసింహ బాలకృష్ణ ప్రస్తుతం తన కొడుకును అందరి హీరోలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. ఈ సినిమా క్లైమాక్స్లో హిట్ 3 ఉండబోతుందని.. అందులో నాని హీరోగా నటించబోతున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్రం బృందం ప్రస్తుతం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అడవి శేష్, నాని, బాలకృష్ణ కలిసి హిట్ 2 సినిమాలో స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా వీక్షించారు. వీరి ముగ్గురితో కలిసి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఈ సినిమాను వీక్షించాడు.

ఇదే విషయాన్ని అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బాలయ్య, మోక్షజ్ఞ, నానితో కలిసి దిగిన ఫోటోలు ఆయన ట్విట్టర్లో షేర్ చేశాడు. బాలయ్య సర్ కి హిట్ 2 సినిమా బాగా నచ్చింది. నా పర్ఫామెన్స్ గురించి దర్శకుడు శైలేష్ విజన్ గురించి ఆయన ఎంతగానో ప్రశంసించారు. హిట్ 2 సిరీస్లో కామియో రోల్ ప్లే చేయాలని.. నేను బాలయ్య సార్ ని రిక్వెస్ట్ చేశాను.. ఆయన చిరునవ్వు నవ్వి ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. మోక్షజ్ఞ కి కూడా హిట్ 2 చాలా బాగా నచ్చింది అంటూ అడవి శేష్ ట్వీట్ చేశాడు. ఇది చూసిన బాలయ్య బాబు అభిమానులు.. బాలయ్య బాబు తన కొడుకుని ఈ విధంగా ఒక్కొక్కరికి పరిచయం చేస్తున్నాడా అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను ఇలా హీరోలకు పరిచయం చేయడానికి కారణం కూడా లేకపోలేదు. త్వరలోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ క్రమంలోనే హీరోలు అందరితో మోక్షజ్ఞ కి పరిచయం ఏర్పడితే .. తన సినిమాకి కొత్త బజ్ ఏర్పడుతుందని.. ఆ కారణంగానే తన కొడుకు పై క్రేజ్ పెంచడానికి ఇలా స్టార్ హీరోలకు పరిచయం చేయిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాలయ్య ఆలోచనలకు అభిమానులు ఫీదా అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *