టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్(Adivi Sesh) ఒక‌రు. ఈయన కేవలం యాక్టర్ మాత్రమే కాదు రైటర్ మరియు డైరెక్టర్ కూడా. 2002లో వచ్చిన `సొంతం` సినిమాలో చిన్న పాత్రను పోషించాడు. అప్పటికి అడివి శేష్‌ వయసు 15 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత శేష్‌ ఇండస్ట్రీ వైపు చూడలేదు. పదేళ్లపాటు అమెరికాలో చదువుకుని మళ్ళీ `కర్మ` సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. పంజా, బలుపు, బాహుబలి తదితర సినిమాల్లో సహాయక పాత్రలు పోషించిన అడివి శేష్ కు హీరోగా `క్షణం` మూవీతో బ్రేక్ వచ్చింది.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో శేష్‌ హీరోగా నటించడమే కాదు రచయితగా కూడా పని చేసి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఈ మూవీతో అడివి శేష్‌ కు కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. ఆ తర్వాత ఈయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా అమీ తుమీ, గూఢచారి, ఎవరు చిత్రాలు చేశాడు. ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. రీసెంట్‌ మేజర్(major) మూవీ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించి మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక తాజాగా శేష్ `హిట్ 2` మూవీ తో వచ్చాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) హీరోయిన్ గా నటించింది. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ అవ్వ‌గా.. తొలి ఆట నుంచే హిట్ టాక్ ల‌భించింది. ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబడుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ చిత్రం ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కు రీచ్ అయిపోయింది.

మొత్తానికి హిట్ 2 రూపంలో అడివి శేష్‌ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది. అదే సమయంలో శేష్‌ ఓ అరుదైన రికార్డును సైతం తన పేరిట లెకించుకున్నాడు అదేంటంటే.. ఇటీవ‌ల కాలంలో వరుసగా 6 హిట్లను ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా శేష్‌ రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డు గ‌త కొంత కాలం నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) పేరిట మాత్రమే ఉంది. ఆయన తర్వాత ఈ అరుదైన ఘనత శేష్ కు సొంతమైంది. ఈ నేపథ్యంలోనే ప‌లువురు సినీ ప్రియులు మ‌రియు నెటిజ‌న్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అడివి శేష్‌ ముందు మిగిలిన హీరోలు దిగ‌దుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *