కృష్ణవంశీ(krishnavamshi) డైరెక్షన్లో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని ఒకే ఒక్క డైలాగ్ తో చాలా పాపులర్ అయ్యారు కమెడియన్ పృథ్వీరాజ్. ఈ డైలాగ్ కేవలం ఆ సినిమాలోనే కాకుండా చాలా సినిమాల్లో దాన్ని ఆయన వాడుకున్నారు. ఎందుకంటే ఆ డైలాగ్ కి అంత క్రేజ్. ఈయన కేవలం సినిమాల్లోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పార్టీలో కొన్ని రోజులు చేరారు.

అంతేకాదు 2014,2019 ఎలక్షన్ టైం లో కూడా వైసిపి పార్టీకి మద్దతుగా చాలా చోట్ల ప్రచారాల్లో ముందుండి ప్రచారం చేశారు.అయితే జగన్(jagan mohan reddy) గెలిచాక ఆయనను ఓ కీలక పదవి లో కూర్చోబెట్టారు. కానీ పృథ్విరాజ్ కి సంబంధించిన ఒక వివాదాస్పద ఆడియో వైరల్ కావడంతో ఆయన ఆ పదవి నుండి తప్పుకున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. పృధ్విరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. పృథ్వీరాజ్ ని ఓ యాంకర్ మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అందులో నిజం ఎంత అనే ప్రశ్న అడిగింది.

దానికి పృథ్వీరాజ్(prudhvi raj) సమాధానం ఇస్తూ.. నేను అసలు సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు.. అయితే ఓ ఎత్తైన ప్రదేశంలో నాలో నేనే ఏదో ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళుతున్న టైం లో డిప్రెషన్ కి గురై ముందు ఏముందో కూడా చూడకుండా కింద పడిపోయాను. కానీ అలా పడిపోయిన టైం లో కింద ఎలాంటి హానికరమైన ప్రాంతం లేదు నేను పడ్డ ప్రాంతం మొత్తం మెత్తగా ఉండడం వల్ల నేను ఆ ప్రమాదం నుండి బయటపడ్డాను. కానీ కుడి చేతికి మాత్రం ఫ్రాక్చర్ అయింది. దానివల్ల కొన్ని రోజులు సినిమాలకు కూడా దూరంగా ఉన్నాను.

ఇక నేను ఎత్తైన ప్రదేశం నుండి కింద పడి గాయాల పాలైన టైం లో నా కుటుంబ సభ్యులు నా అలనా పాలన అన్ని చూసుకున్నారు. ఇక నేను కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.ఆ టైంలో అన్ని దగ్గర ఉండి నా కుటుంబ సభ్యులు చూసుకున్నారు. అయితే నేను అలా పైనుండి కింద పడ్డ టైంలో చాలామంది నా మీద అసత్య ప్రచారాలు చేశారు. నేను సూసైడ్(sucide) చేసుకున్నాను అంటూ చాలామంది పబ్లిక్ గా ఎన్నో వార్తలు రాశారు. కానీ నేను ఏదో డిప్రెషన్ లో ఉండి అలా పడిపోయాను.అంతేకానీ సూసైడ్ మాత్రం చేసుకోవాలి అనుకోలేదు అంటూ తన సూసైడ్ పై వచ్చిన వార్తలకు కమెడియన్ పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *