I had no intention of returning to films: Vijayashantiలేడీ సూపర్ స్టార్ గా.. లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో.. యాక్షన్ సన్నివేశాలతో హీరోలకు సైతం చెమటలు పట్టించేది. అంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. పారితోషకం విషయంలో కూడా ఏ రోజు వెనుకడుగు వేయలేదు. హీరోలతో సమానంగా పారితోషకం తీసుకొని.. హీరోలతో సమానంగా నటించి మంచి పేరు కూడా సంపాదించుకుంది.. అయితే ఒకానొక సమయంలో ఈమె చేసిన తప్పు వల్లే మా అసోసియేషన్ నుంచి విజయశాంతి బ్యాన్ చేయబడ్డారు.

ఒకప్పుడు మా ఎలక్షన్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వారికి తప్ప బయట వాళ్లకు తెలిసేవి కాదు. కానీ ఇటీవల మా ఎన్నికలంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. దానికి కారణం ఇటీవల మా ఎన్నికల సమయంలో నెలకొన్న వివాదమే.. ఏకంగా రిగ్గింగ్, బెదిరింపులు అంటూ రాజకీయాలను తలపించాయి మా ఎన్నికలు.. అంతేకాదు మా ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి పోటీలో ఉన్న సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శ అస్త్రాలు గుప్పించి మరింతగా వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే మొదటగా మా ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత నామినేషన్ ను విత్డ్రా చేసుకున్న సీవీఎల్ నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మా ఎన్నికల్లో తెలంగాణ వాదంతో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సీవీఎల్ నరసింహారావు చర్చిస్తూ చిత్రపురి కాలనీలో జరిగిన అనేక అన్యాయాలు, అక్రమాల గురించి మాట్లాడారు. అంతేకాదు పద్మాలయా వంటి అనేక స్టూడియోస్ లలో తెలంగాణకి కూడా వాటా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే దాని గురించి ప్రశ్నించినందుకు మా లో సభ్యురాలుగా ఉన్న విజయశాంతి సభ్యత్వాన్ని తొలగించారు అని సీవీఎల్ సంచలన నిజాన్ని బయటపెట్టారు.

అయితే అక్కడ ఆమె అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేసింది కానీ ఆమె చేసింది తప్పు అన్నట్టుగా ఆమె సభ్యత్వాన్ని తొలగించి.. ఆమెను మా అసోసియేషన్ నుంచి బ్యాన్ కూడా చేశారు. ఇప్పటికీ ఆమె మా సభ్యులు కాదని తొక్కేస్తూనే ఉంటారు అంటూ సీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. మరొక విషయం ఏమిటంటే.. తెలంగాణ వాదానికి సపోర్ట్ చేసినందుకు విజయశాంతిని బ్యాన్ చేశారని సీవీఎల్ చెప్పడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *