సాధారణంగా ఒక హీరో అనుకున్న సినిమాని మరొక హీరో చేస్తూ ఉంటారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా చేద్దామనుకున్న సినిమాను రాజమౌళి రామ్ చరణ్ చేత చేయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే స్టార్ డైరెక్టర్ రాజమౌళి వేర్వేరు కారణాల వల్ల యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి పని చేయడానికి మాత్రమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలా రాజమౌళి – రామ్ చరణ్ కాంబినేషన్లో మగధీర సినిమా రాగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.Film Screening Room: Magadheera - A Telugu Action Epic - Falling in Love  with Bollywood

అయితే తాజాగా రామ్ చరణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చెప్పిన విషయాలు నెటిజనులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి , మెగాస్టార్ చిరంజీవికి మగధీర కథ చెబుతున్న సమయంలో తాను కూడా అదే గదిలో ఉన్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. రాజమౌళి సినిమా కథ చెప్పే సమయంలో చిరంజీవి తనను తాను మరిచిపోయి.. ఆ కథను వింటూ ఉండిపోయారని రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇంటర్వెల్ కు సంబంధించిన సీన్లను చదువుతున్న సమయంలో ఆ కథలో నాన్న లీనమైపోయి హెలికాప్టర్ నుంచి ఎలా దూకాలని అడిగారని చరణ్ కామెంట్లు చేశారు.Magadheera Clocks 13 Years: Unknown Facts About Mega Power Ram Charan  Starrer That You Must Know About

అయితే చిరంజీవి అలా చెప్పిన వెంటనే ఆ విషయాన్ని గమనించిన రాజమౌళి.. ఆ కథ రామ్ చరణ్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ అని చెప్పారని చరణ్ చెప్పుకొచ్చారు. మగధీర సినిమా కథ రామ్ చరణ్ కంటే చిరంజీవికే బాగా నచ్చినట్లు ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం. ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటించే అవకాశం వచ్చి ఉంటే చిరంజీవి అసలు వదులుకునే వారు కాదని కూడా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు.

రాజమౌళి చిరంజీవితో ఒక ఫుల్ లెన్త్ రోల్ లో ఒక సినిమా తెరకెక్కించాలని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందుకు రాజమౌళి ఒప్పుకుంటాడా? ఒకవేళ ఒప్పుకుంటే సినిమా సెట్ పైకి ఎప్పుడు వస్తుంది? అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే మగధీర సినిమాలో రామ్ చరణ్ కి బదులుగా చిరంజీవి నటించినా..ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టేది కాకపోతే కొన్ని కొన్ని మార్పులు చేయాల్సి వచ్చేది అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *