అడివి శేష్(ADIVI SHESH) హీరోగా వచ్చిన హిట్ -2 సినిమా తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకు పోతోంది. ఈ సినిమాకి శైలేష్ కొలను డైరెక్షన్ వహించారు. ఇక హిట్ సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటించగా హిట్ -2 సినిమాలో అడివి శేష్ హీరోగా వచ్చారు. అలాగే హిట్-3 సినిమా కూడా ఉండబోతుంది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక హిట్ 3 సినిమాలో నాని హీరోగా వస్తున్నాడు అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హిట్ 2 సినిమాకి నిర్మాతగా నాని వ్యవహరించారు. ఇక హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో త్వరలో హిట్ 3 కూడా ఉంటుంది అంటూ ఒక హింట్ ఇచ్చారు మూవీ మేకర్స్ .

అలాగే హిట్ 3లో నాని(NANI) నటించబోతున్నాడు అంటూ ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే హిట్ 3 సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే ఒక బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ఒక లేడీ అభిమాని హిట్ 3 సినిమాలో విలన్ గా ఎవరు ఉంటే బాగుంటుంది అనే దానిపై ఒక షాకింగ్ విషయాన్ని చెప్పింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే.. హిట్ 3 సినిమాలో కచ్చితంగా విలన్ గా సైకో కిల్లర్ గా లేడీ విలనే ఉండాలి. లేడీ విలన్ ని పెట్టకపోతే నేను అస్సలు ఒప్పుకోను. ఒకవేళ మీరు లేడీ సైకో కిల్లర్ ని పెట్టకపోతే ఆ మహేష్ ని నేనే వచ్చి చంపేస్తాను.

ఆ లేడీ సైకో కిల్లర్ గా నేనే పేరు తెచ్చుకుంటాను అంటూ సరదాగా నవ్వుతూ ఆ అభిమాని హీరో నాని కి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది. ఇక ఈ వీడియోలో అడివి శేష్ ఈ అమ్మాయి ఒకవేళ చంపిన చంపేస్తుంది కానీ అది రియల్ గా కాదు థియేటర్లో అంటూ సరదాగా రిప్లై పెట్టారు. అయితే ఆ అమ్మాయి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేయడంతో ఈ వీడియో పట్ల నెటిజన్స్ కూడా చాలా సరదాగా స్పందిస్తున్నారు. ఇంకొంతమందేమో అసలు ఈ మహేష్ ఎవరు అంటూ అయోమయంలో పడ్డారు.

ఆ అమ్మాయి మహేష్ (MAHESH)ని ఎందుకు చంపుతా అంటూ వార్నింగ్ ఇచ్చింది అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. హీరో నాని హిట్ 3సినిమాలో నటించబోతున్నాడు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ కొంతమంది నెటిజన్స్ మాత్రం నానికి ఆ పాత్ర అస్సలు సెట్ కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే హిట్ 3సినిమాలో హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే హిట్ 3 నే కాకుండా ఈ డైరెక్టర్ సెవెన్ సీక్వెల్స్ తీస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *