ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రమోహన్ కేవలం నటుడు మాత్రమే కాదు ఎంతోమంది హీరోయిన్లకు లక్కీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ఈయన సరసన నటించే ఏ హీరోయిన్ అయినా సరే తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్గా చలామణి అవుతుంది అనే ఒక సెంటిమెంట్ కూడా ఉండేది. అంతలా హీరోయిన్లకు అదృష్ట వంతుడిగా మారిపోయాడు చంద్రమోహన్.. ప్రస్తుతం హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటిస్తూ అద్భుతమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈయన గత ఐదు సంవత్సరాలుగా ఇండస్ట్రీ నుంచి దూరంగా కుటుంబానికి దగ్గరగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు.

చంద్రమోహన్ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. జలంధర మాట్లాడుతూ..” చంద్రమోహన్ చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుంది. జనవరి ఒకటో తారీకు ఎంతోమంది వస్తూ ఉంటారు.. అలా ఆయన చేతితో నాకు డబ్బు ఇవ్వడం వల్ల నాకు మంచి రచయిత్రిగా కూడా పేరు వచ్చింది అంటూ చెప్పడంతో చంద్రమోహన్ ఎమోషనల్ అయ్యి కళ్ళు తుడుచుకున్నాడు.

ఈ క్రమంలో నే తాను పోగొట్టుకున్న ఆస్తి గురించి చెబుతూ..” గొల్లపూడి మారుతీ రావు కొంపల్లి దగ్గర ద్రాక్ష తోట కొన్నారు. నన్ను కొనుమని చెప్పారు. నేను 35 ఎకరాల వరకు కొన్నాను . కానీ మేనేజ్ చేయలేక అమ్మేశాను. శోభన్ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మాను. ఈరోజు దాని విలువ రూ.30 కోట్లు . శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్డుకు 6ఎకరాలు కొన్నాను. అది కూడా అమ్మేశాను. అప్పుడప్పుడు మంచి రిసార్ట్ లు కూడా పెట్టాను. కానీ చూసుకోలేక అమ్మేశాను. ఇలా దాదాపుగా రూ.100 కోట్ల వరకు పోగొట్టుకున్నాను.

సంపాదించిన వాటికంటే పోగొట్టుకున్నవే ఎక్కువగా ఉన్నాయి అంటూ తెలిపారు. మరొకవైపు నాది.. జయసుధది కూడా ఇదే పరిస్థితి .. జయసుధ కూడా సుమారుగా తన కెరీర్ లో రూ. 100 కోట్ల ప్రాపర్టీని పోగొట్టుకుంది ” అంటూ కొన్ని విషయాలు వెల్లడించారు చంద్రమోహన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *