తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్(SR.NTR) లేకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ లేదు అని చెప్పుకోవచ్చు. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు నందమూరి తారకరామారావు. ఇక అలాంటి నందమూరి తారకరామారావు నటవారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ఇంతటి పేరు ఉన్న నందమూరి ఫ్యామిలీ నుండి ఎంతో అందం ఉన్న అమ్మాయిలు ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు.

అంతేకాకుండా బాలకృష్ణ(BALAKRISHNA) కూతర్లు ఎంత అందంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో జీవిత రాజశేఖర్ కూతుర్లు కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఇంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయితే అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నందమూరి కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలు ఒక్కరు కూడా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అవ్వలేదు. అయితే బాలకృష్ణ కూతుర్లు హీరోయిన్స్ గా రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక ఈయనకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. ఇక కొడుకు మోక్షజ్ఞ (MOKSHGNA)విషయంలో చాలామంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈయన ఎంట్రీ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే బాలకృష్ణ ఇద్దరు కూతుర్లు చాలా అందంగా ఉంటారు. అంతేకాదు వాళ్ళిద్దరూ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోరు. కానీ వాళ్లు మాత్రం ఇండస్ట్రీకి హీరోయిన్స్ గా రాలేదు. దీనికి ప్రధాన కారణం అందరూ బాలకృష్ణనే కావచ్చు అని అనుకుంటారు.

అయితే ఈ విషయంలో బాలకృష్ణ ఏ రోజు కూడా వారికి అడ్డు చెప్పలేదట. కానీ బాలకృష్ణ కూతుర్లకు హీరోయిన్స్ గా రావడం అస్సలు ఇష్టం లేదట.ఎందుకంటే వీరిద్దరూ స్కిన్ షో కి,గ్లామర్ పాత్రలకు ఆమడ దూరంలో ఉంటారు. అలాగే హీరోయిన్స్ అంటే కచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాలి. అందుకే ఈ విషయం నచ్చని బాలకృష్ణ కూతుర్లు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక చిన్న కూతురు తేజస్విని(TEJASWINI)కి ఇండస్ట్రీపై మక్కువ ఉన్నప్పటికీ స్క్రీన్ మీద కంటే స్క్రీన్ వెనుక ఉండడానికే ఈమె ఎక్కువ ఇష్టపడుతుంది. ఇక అలాగే పెద్దకూతురు బ్రాహ్మణి కి సినిమాలు అంటే అస్సలు నచ్చవు అందుకే ఆమె ఎక్కువగా బిజినెస్ పై మక్కువ చూపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *