పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్(prabhas) ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేతిలో `స‌లార్‌`, `ప్రాజెక్ట్-కె`, `స్పిరిట్‌` వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే ఈయ‌న న‌టించిన `ఆదిపురుష్‌` షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇక వీటితో పాటు ప్ర‌భాస్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌(nidhi agarwal), రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు. బాలీవుడ్‌ యాక్టర్ సంజయ్ దత్ విల‌న్‌ పాత్రను పోషిస్తున్నార‌ని స‌మాచారం. అలాగే థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడ‌ట‌. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. `రాజా డిలక్స్` అనే థియేటర్ చుట్టు తిరిగే తాత-మనవళ్ళ కథతో ఈ మూవీని రూపొందిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ, ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఫ‌స్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని.. రెండు షెడ్యూల్ కు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలోని కేవ‌లం సీజీ వర్క్‌ కోసమే ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెడుతున్నార‌ట‌. ఈ సినిమాలో సీజీ వర్క్‌కు ఎక్కువ ప్రధాన్యత ఉందట. అందుకోసమే మేకర్స్ అంత ఖర్చు చేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

ఏదేమైనా సీజీ వర్క్‌ కోసమే రూ.80 కోట్లు పెడుతున్నారంటే.. ఈ సినిమా బడ్జెట్ ఊహించిన దానికంటే భారీగానే ఉండనున్నట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమాకు కోపం ప్ర‌భాస్ వంద రోజుల కాల్షీట్‌లు మాత్ర‌మే ఇచ్చాడ‌ట‌. వంద రోజుల్లోనే త‌న‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను ఫినిష్ చేయాల‌ని ప్ర‌భాస్ కండీష‌న్ పెట్ట‌డంతో.. అందుకు మారుతి(maruti) గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *