Dailyhuntప్రస్తుతం సినిమాల కంటే సీరియల్స్ బాగా పాపులారిటీని దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా కేవలం మూడు గంటలు మాత్రమే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. కానీ సీరియల్ సంవత్సరాల తరబడి ప్రేక్షకులను టీవీకి కట్టిపడేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మన ఇంట్లో, చుట్టుపక్కల జరిగే సన్నివేశాలని కథ రూపంలో తెరకెక్కిస్తూ అద్భుతంగా టిఆర్పి రేటింగ్ను సొంతం చేసుకుంటున్నాయి సీరియల్స్. సినిమాలు చూడడానికైనా ఆలస్యం చేస్తారేమో కానీ సీరియల్స్ ఒక్కరోజు ఎపిసోడ్ మిస్ అయినా సరే ఇబ్బంది పడిపోతూ ఉంటారు సీరియల్ లవర్స్.

అందుకే సినిమా హీరోయిన్లకు ఏ రేంజ్ లో అయితే పాపులారిటీ ఉంటుందో అంతకుమించి బుల్లితెర హీరోయిన్స్ పాపులారిటీ దక్కించుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఫాలోవర్స్ విషయంలో సినిమా హీరోయిన్స్ కంటే సీరియల్ హీరోయిన్స్ కి ఎక్కువ పాపులారిటీ ఉందట. అంత పాపులారిటీ దక్కించుకున్నారు కాబట్టే పారితోషకం విషయంలో కూడా డిమాండ్ చేస్తున్నారు. సీరియల్స్ లో లీడ్ రోల్ చేసే హీరోయిన్స్ యొక్క పారితోషకం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అయితే మన సీరియల్ హీరోయిన్స్ పారితోషికం ఎంతో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

కార్తీకదీపం – ప్రేమీ విశ్వనాథ్:
కార్తీకదీపం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో.. అందులో లీడ్రోల్ పోషిస్తున్న వంటలక్క పేరు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె పాపులారిటీ చూసి హీరోయిన్స్ కూడా కుళ్ళుకుంటున్నారటంలో సందేహం లేదు. ఈ వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఈమెకు పాపులారిటీ మాత్రమే కాదు పారితోషకం కూడా ఎక్కువే. ఒక్కరోజు సెట్ లో కనిపించిందంటే చాలు రూ.25 వేల పారితోషకం ఇవ్వాల్సిందే . అంత డిమాండ్ ఉంది ఈ ముద్దుగుమ్మ కి.

దేవత – సుహాసిని:
ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సుహాసిని.. ఒకప్పుడు సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది . ప్రస్తుతం ఈమె ఒక్కరోజు షూటింగ్ కి రూ.20వేల పారితోషకం తీసుకుంటోంది. ఈమె సీరియల్స్ లో హీరోయిన్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది.

ఆడదే ఆధారం – పల్లవి రామిశెట్టి:
బుల్లితెర అనుష్కగా పేరు సంపాదించుకున్న ఈమె ఒక్క రోజుకు సుమారుగా 15000 రూపాయల పారితోషకం తీసుకుంటుంది.

చంద్రముఖి – మంజుల:
సీరియల్ హీరో నిరూపమ అలియాస్ డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈయన మాత్రమే కాదు ఈయన భార్య కూడా సీరియల్స్ లో హీరోయిన్గా నటిస్తోంది . ప్రస్తుతం ఈమె ఒక్క రోజుకు రూ.8000 పారితోషకం అందుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *