మహానటి గా పేరు తెచ్చుకున్న సావిత్రి(savithri) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమె అలనాటి కథానాయకుల్లో అందరికంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అంతేకాదు ఈమె తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అందరికీ దానం చేస్తూ చివరికి ఒంటరిగా అయిపోయింది. తినడానికి కూడా తిండి లేక చాలా ఇబ్బందులు పడింది. ఇక ఈమె జీవిత కథకు సంబంధించి ఈ మధ్యనే మహానటి పేరుతో సినిమా కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలన్నీ పూర్తిగా సావిత్రి జీవితం లో జరిగినవే.అయితే సావిత్రి చనిపోయాక ఆమె మీద ఎన్నో వార్తలు వచ్చాయి. చాలామంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూలో పాల్గొని ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెప్పారు.

నిజానికి సావిత్రి గురించి అంతగా ఎవరికి తెలియదు. ఆమె గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులు అంటే కేవలం ఆమె కొడుకు, కూతురు మాత్రమే. సావిత్రి కూతురు చాముండేశ్వరి(chamundeshwari) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సావిత్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.. సావిత్రి కూతురు మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయాక మా అమ్మ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అందులో చాలా వరకు అబద్ధాలే. నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. కానీ నా భర్త కనీసం డిగ్రీ కూడా చదవకపోతే ఎలా అని పెళ్లయ్యాక కూడా నన్ను డిగ్రీ చదివించారు. ఇక నేను డిగ్రీ పరీక్షలు రాసే టైం లో మా అమ్మ మంచాన పడింది. ఆ టైంలో ఓ పక్కన పరీక్షలు రాస్తూనే మరో పక్కన నా తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక ఆ టైంలో నాకు ఓ చిన్న బాబు కూడా ఉన్నాడు.

మా అమ్మ ను చూసుకోవాడానికి తమ్ముడు సతీష్ (sathish)కూడా స్కూల్ మానేసి ఇద్దరం అమ్మ బాగోగులు అన్ని చూసుకునేవాళ్ళం. ఇక మా అమ్మ 19 నెలలు కోమాలోకి వెళ్ళింది. ఆ టైంలో మా నాన్న జెమినీ గణేష్ (jemini ganeshan)మమ్మల్ని బాగానే చూసుకున్నారు. అంతేకాదు మా నాన్న ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే. ఇక దాంతో మా అమ్మకి ఫారన్ నుండి డాక్టర్లను తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించారు. మా నాన్న ఫ్యామిలీలో చాలామంది డాక్టర్లు ఉండడంవల్ల ఇంట్లోనే మా అమ్మని ఉంచుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు హాస్పిటల్ తీసుకువెళ్లి మా అమ్మకు ట్రీట్మెంట్ చేయించారు. ఆ టైంలో చాలామంది ఆమెతో కలిసి నటించిన హీరోయిన్లు అమ్మను చూడడానికి వచ్చేవారు.

కానీ చనిపోయాక కొంత మంది హీరోయిన్లు అమ్మను అలాంటి పరిస్థితిలో చూడలేక చూడడానికి రాలేదు. ఎందుకంటే అమ్మను ఆ పరిస్థితిలో చూసి వాళ్లు తట్టుకోలేమని అందుకే వాళ్ళు మీ అమ్మ చివరి చూపుకు మేము నోచుకోలేదని చెబుతారు. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా చాలా ఘనంగా ఆమె సహ నటీనటులు కన్నీటి వీడ్కోలు ఇచ్చారు.. అమ్మ చనిపోయాక కూడా చాలామంది హీరోయిన్లు నాతో ఫోన్లో మాట్లాడేవారు. ఇక చివరి రోజుల్లో అమ్మకి కేవలం నోట్లో పైపు ద్వారానే జ్యూస్ ని, టాబ్లెట్స్ ని కరిగించి పంపించేవారు. ఇక మా అమ్మ ఎన్నో ఆస్తులు కూడాబెట్టి చాలామంది చేతిలో దారుణంగా మోసపోయింది. అలా అని మాకు ఎవరిమీద కోపం లేదు. మా అమ్మ పోయాక మా నాన్న మమ్మల్ని బాగానే చూసుకున్నారు. అంతేకాదు మేము జీవితాంతం కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్థి ని రాసిచ్చారు. మా అమ్మ విషయంలో మేము ఎవరిని తప్పు పట్టడం లేదు. మా అమ్మ ఎలాంటిదో అందరికీ తెలుసు అంటూ సావిత్రి కూతురు చాముండేశ్వరి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *