యాపిల్ బ్యూటీ హన్సికా మోట్వాని(hansika motwani) నేడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపార‌వేత్త‌ సోహైల్‌ కథూరియాతో హ‌న్సిక వివాహం జ‌ర‌గ‌బోతోంది. జైపూర్‌లోని చారిత్రక ముండోతా కోట వీరి పెళ్లి వేదిక కానుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో హ‌న్సిక‌-సోహైల్ ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రిగాయి. ముండోతా కోటలో గ‌త రెండు రోజులుగా హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ అంటూ హన్సిక, ఆమెకు కాబోయే భ‌ర్త‌, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫుల్‌ ఎంజాయ్ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే హ‌న్సిక పెళ్లికి కొంద‌రు ఊహించ‌ని అథితులు కూడా రాబోతున్నారు. రాజకోటలో జరిగే పెళ్లికి ఊహించ‌ని అథితులు అంటే పెద్ద సెలబ్రిటీలు అనుకుంటే పొర‌పాటే అవుతుంది. ఎందుకుంటే హ‌న్సిక పెళ్లికి పేద చిన్నారులు అథితులుగా రాబోతున్నారు. హన్సిక గొప్ప న‌టి మాత్ర‌మే కాదు.. ఈమె సేవా కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటుంది.

కొన్ని ఎన్జీవోలతో కలిసి కూడా పని చేస్తుంటుంది. ఈ నేప‌థ్యంలోనే తన పెళ్ళికి హాజరయ్యే అతిథుల జాబితాలో కొందరు చిన్నారుల్నీ చేర్చింది. వారంతా నిరుపేదలు, పైగా అనాధలు. అలాంటి చిన్నారులకు త‌న పెళ్లి ఆహ్వాన పత్రిక‌ పంపించి తన మంచి మనసు చాటుకుంది. అంతేకాదు, త‌న పెళ్లికి రాబోయే స‌ద‌రు చిన్నారులకు అతిథి మర్యాదలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయించింది.

పెళ్లికి తమని పిలిచిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ సదరు చిన్నారులు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు హ‌న్సిక నిజంగా గ్రేట్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రిత‌మే తన కాబోయే భర్తని హ‌న్సిక అందరికి పరిచయం చేసింది. ఈఫిల్ టవర్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ సోహెల్ కథూరియా(sohail kathuria) ప్రపోజ్ చేసిన ఫోటోలని అంద‌రితోనూ పంచుకుంది. ఇక వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *