ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun), సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైజ్`. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా చేశారు. అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది.

మొదట టాక్ కాస్త నెగటివ్ గా వచ్చినా.. ఆ తర్వాత అది పాజిటివ్ గా మారింది. దాంతో ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని రష్యాల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 8న పుష్ప ను రష్యాలో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, రష్మిక(rashmika), డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తదితరులు రష్యా వెళ్లి అక్కడ సినిమాపై మంచి హైప్‌ ను క్రియేట్ చేసేందుకు జోరుగా ప్రమోషన్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే రష్యన్ భాషలో రూపొందించిన పుష్ప(pushpa) ట్రైలర్ కు విశేష ఆదరణ లభించింది. దీంతో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ర‌ష్య‌న్ సినీప్రియల‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు రష్యాలో పుష్ప ప్రమోషన్స్ కు పెడుతున్న ఖ‌ర్చు నెట్టింట హాట్‌ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప సినిమాను రష్యాలో విడుదల చేయడానికి మరియు అక్కడ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ చేయడానికి ఏకంగా రూ. 10 కోట్లను ఖర్చు చేస్తున్నారట.

అక్కడ ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నారట. ఏదేమైనా పరాయి గడ్డపై మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం ఇక్క‌డ‌ సినీప్రియల‌ను ఆశ్చర్యపరుస్తుంది. మరి ఈ సినిమా రష్యన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. కాగా, పుష్ప కు కొనసాగింపుగా `పుష్ప 2` రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లె ఈ చిత్రం ప్రారంభం అయింది. రష్యా(russia)లో ప్రమోషన్స్ పూర్తయిన వెంటనే చిత్ర టీం హైదరాబాద్ కు వచ్చి షూటింగ్ ను షురూ చేయబోతున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *