Sridevi: నటన రంగంలోకి శ్రీదేవి మేనకోడలు, ఆకట్టుకుంటున్న వీడియోఅతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ ముద్దుగుమ్మ కేవలం దక్షిణాది సినిమాలలోనే కాదు ఉత్తరాది సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ముఖ్యంగా ఈమె అందం చూసి యువత మంత్రముగ్ధులైతే.. ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఈమె సినిమాల కోసం క్యూ కట్టేవారు. అంతలా పాపులారిటీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తర్వాత తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీకి తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోలు, నిర్మాతల వారసులు మాత్రమే ఒకప్పుడు ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్ల వారసులు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు హీరోయిన్ల కూతుర్లు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. వారిలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఒకరు. శ్రీదేవి కూతురు ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తన అందాలతో యువత మతిపోగొడుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి మేనకోడలు సైతం సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి మేనకోడలు శిరీష ప్రైవేటు ఆల్బమ్ తో తాజాగా తెరపైకి వచ్చింది. కేరళ నేపథ్యంలో అక్కడి సంప్రదాయం లో సాగే ఒక లవ్ ట్రాక్ వీడియోలో ఆమె హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో నటించిన శ్రీదేవి మేనకోడలు శిరీషకి కూడా మంచి గుర్తింపు లభించింది.

ఈ వీడియోలో హీరోగా నటించిన వ్యక్తి ఎవరో కాదు శివాజీ గణేషన్ మనవడు దర్శన్. ప్రైవేట్ సాంగ్ తెలుగు లో కూడా” ఎదలో మౌనం” అంటూ సాగే మ్యూజిక్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ పాటలో శ్రీదేవి మేనకోడలు శిరీష అందం మరియు నటన చూస్తుంటే త్వరలోనే బిగ్ స్క్రీన్ పై కూడా శిరీష ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వి కూడా మొన్నటి వరకు బాలీవుడ్ లో సత్తా చాటి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే శ్రీదేవి మేనకోడలు శిరీష కూడా సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *