రామ్ పోతినేని (ram pothineni)ఈ మధ్యనే ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాఫ్ టాక్ ని మూట గట్టుకున్నారు. ఇక ఈయన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత జయాపయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇక పూరి దర్శకత్వంలో ఈయన నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అప్పటివరకు ప్లాఫ్ లో ఉన్న ఈ హీరోకి, డైరెక్టర్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ లభించింది.ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా రామ్ పోతినేని ని ఓ హీరోయిన్ తమ ప్రేమ వ్యవహరం లోకి లాగినట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్(rishab panth) బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన ఊర్వశి రౌతేలా ఇద్దరూ ఘాటు ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీళ్ళిద్దరూ తమ విషయం గురించి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటించకపోయినప్పటికీ వీరు చెట్టాపట్టాలేసుకొని తిరగడం అందరూ గమనించారు. అంతేకాదు వీరి గురించి ఏదో ఒక విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. కానీ ఏమైందో ఏమో కానీ గత కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయినట్టు కూడా సమాచారం. ఇక వీరు బ్రేకప్ చెప్పుకున్నారు అనేదానికి సంకేతంగా రిషబ్ పంత్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఊర్వశి ఖాతాని బ్లాక్ చేశారు. దీంతో నెటిజన్స్ లో మరింత అనుమానం పెరిగింది.

అంతేకాదు వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ కౌంటర్లు వేసుకోవడం ఈ మధ్యన చూస్తూనే ఉన్నాం. అలాగే రిషబ్ పంత్ ఎలాంటి పోస్ట్ పెట్టిన దానికి సెటైర్ వేస్తూ లేదా కౌంటర్ ఇస్తూ ఊర్వశి అతనికి ఆపోజిట్ గా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇక ఊర్వశి(urvashi) ఇలా చేయడం వల్ల ఆమెకు సోషల్ మీడియాలో చాలా పబ్లిసిటీ ఏర్పడింది. దాంతో ఈమె తన ప్రేమ వ్యవహారం వల్ల అవకాశాలు బాగానే అందుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో మిస్టర్ ఆర్ పి అంటూ ఓ పోస్ట్ పెట్టింది హీరోయిన్. ఇక ఈ హీరోయిన్ పెట్టిన పోస్ట్ చూసిన నెటిజెన్స్ అందరూ ఆర్ పి అంటే రిషబ్ పంత్ అని అనుకున్నారు.

అంతేకాదు ఈ విషయంలో ఆమెను క్లారిటీ అడగడానికి ఆర్ పి అంటే రిషబ్ పంతా అని అడిగారు. కానీ ఆమె అసలు ఆర్ పి అంటే రిషబ్ పంత్ అని ఎవరన్నారు. నేను ఆర్ పి(rRP) అని పిలిచింది టాలీవుడ్ లో యంగ్ హీరో అయినా రామ్ పోతినేనిని. ఆ హీరో నా సహనటుడు..అందుకే నేను అతని గురించి నా సోషల్ మీడియా ఖాతాలో చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఆర్ పి అంటే రిషబ్ పంత్ అని నాకు ఇప్పుడు మీరు చెప్పే వరకు తెలియదు. ఆ విషయం తెలియక నేను ఆర్ పి అనే పోస్ట్ పెట్టాను. నేను కేవలం నా సహనటుడు అయినా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనిని మాత్రమే ఉద్దేశించి ఇలా పోస్ట్ పెట్టాను అంటూ హీరోయిన్ ఊర్వశి నేటిజన్స్ కి క్లారిటీ ఇచ్చింది. ఇక దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్స్ వీరిద్దరి ప్రేమ మధ్యలోకి టాలీవుడ్ యంగ్ హీరోని కూడా లాగారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరి ప్రేమ విషయంపై రామ్ పోతినేని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *