Prabhas Farmhouse Price Creates Flutter | cinejosh.comతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. తాను నటిస్తున్న పాన్ ఇండియా చిత్రలలో ఒక్కో చిత్రానికి రెమ్యూనరేషన్ గా రూ.150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ గా దాదాపుగా రూ.555 కోట్ల రూపాయలు దక్కినట్లు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో ప్రభాస్ జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ ద్వారా కథనాలు వెలువడడం జరిగింది. అయితే ఆ న్యూస్ పేపర్లో మాత్రం ఆ సైట్ వ్యాల్యూ కోటి రూపాయల 5 లక్షల కి ప్రభాస్ 84 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా పేర్కొంది.

కానీ జూబ్లీహిల్స్ లో ఎకరా స్థలం విలువ ఇప్పుడు ఎంత ధర పలుకుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ప్రభాస్ 84 ఎకరాలలో ఈ ఫామ్ హౌస్ ఉందని ఆ వెబ్సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఇందులో ఏ మాత్రం నిజం లేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్ విలువ దాదాపుగా రూ.87 కోట్ల రూపాయలు అన్నట్లుగా సమాచారం. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి ఈ కథనం గురించి ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన శోభు మార్లగడ్డ స్పందించడం గమనార్హం.

శోభు యార్లగడ్డ మాట్లాడుతూ వైరల్ అవుతున్న ఈ వార్త నిజమా అంటూ సెటైర్లు వేయడంతో పాటు జూబ్లీహిల్స్ 84 ఎకరాలు అంటే దాని విలువ మీకే తెలిసి ఉండాలి అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా ఇలాంటి చెత్త రాతలు రాసి ఆ వార్తలకు సెలబ్రిటీల పేర్లు వాడడం చాలా అలవాటైపోయింది అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మరి ఆ వెబ్సైట్ నిర్వహకులు ఏ విధంగా స్పందిస్తారు తెలియాల్సి ఉంది. ప్రభాస్ మాత్రం ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరని చెప్పవచ్చు.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల విషయానికొస్తే.. ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్-k తదితర చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు అన్ని అత్యధిక భారీ బడ్జెట్ తోని తెరకెక్కించే చిత్రాలే.. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కు ఏ సినిమా సరైన సక్సెస్ అందిస్తుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *