న్యాచురల్ స్టార్ నాని(Nani) గురించి తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. పుట్టింది కృష్ణాజిల్లాలో అయినా చిన్న‌త‌నం నుంచి హైదరాబాద్ లోనే పెరిగాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రైండ్‌ లేకపోయినా సినిమాలపై ఉన్న మక్కువతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. `అష్టా చమ్మా` సినిమాతో హీరోగా మారాడు. ఇదొక చిన్న సినిమా. కలర్స్ స్వాతి తప్ప ఆ సినిమాలో ఇంకెవరున్నారో కూడా ఎవరికీ సరిగా తెలియదు.

అయితే ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ తర్వాత నాని అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. అయితే గ‌త‌ కొంతకాలం నుంచి నాని కెరీర్‌ అంత సానుకూలంగా సాగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. కానీ, సరైన హిట్టు మాత్రం పడడం లేదు. ఇటీవల విడుదలైన నాని చిత్రాల్లో శ్యామ్ సింగ రాయ్(shyam singha roy) మినహా.. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్, నాని గ్యాంగ్ లీడర్, టక్‌ జగదీష్, అంటే.. సుందరానికి ఇలా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

వ‌రుస ఫ్లాపుల‌ నేపథ్యంలో నాని మార్కెట్ సైతం బాగా డౌన్ అయింది. అయితే ఇలా నాని కెరీర్‌ నాశనం అవ్వడానికి ఒకే ఒక్క త‌ప్పు కార‌ణంగా వినిపిస్తోంది. ఒకప్పుడు నాని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా కథల‌ను ఎంపిక చేసుకునేవాడు. కానీ ఇప్పుడు మాస్, క్లాస్‌ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథలు ఎంచుకుంటున్నాడు. కమర్షియల్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ క‌థ, క‌థ‌నాల‌ను గాలికి వదిలేస్తున్నాడు.

ఈ ఒక్క త‌ప్పు వల్లే నానికి వ‌రుస‌గా ఫ్లాపులు పడుతున్నాయని సినీప్రియలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయాన్ని గ్రహించి నాని కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటాడా..? లేదా..? అన్నది చూడాలి. కాగా, ప్రస్తుతం నాని `దసరా(dasara)` అనే సినిమాలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *