తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి గౌరవం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచు మోహన్ బాబు(MOHAN BABU) తన నటన తో అందరినీ ఆకట్టుకొని ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక కలెక్షన్ కింగ్ గా ఆయన తిరగరాసిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. అయితే మోహన్ బాబు తన నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ ని తీసుకువచ్చారు. ఇక ఇద్దరు అన్నదమ్ములు స్టార్డం తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తండ్రి లా పేరు మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు.

అంతేకాదు ఈ మధ్యకాలంలో వీరు ఏ సినిమా తీసిన విమర్శల పాలవుతున్నారు. అయితే గత రెండు నెలల నుండి మంచు ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి ప్రధాన కారణం మంచు మనోజ్ భూమా మౌనిక (BHUMA MOUNIKA)అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్నారని,అయితే ఈ విషయం ఇంట్లో ఇష్టం లేదని, ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా మంచు మనోజ్ ఆ అమ్మాయితో సీక్రెట్ గా తిరుగుతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక మనోజ్ రెండో పెళ్లి విషయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని ,దాంతో మంచు మనోజ్ ని ఫ్యామిలీ దూరం పెట్టింది అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ విషయం పక్కన పెడితే..తాజాగా మంచు మనోజ్ (MANOJ)వారి ఫ్యామిలీతో కలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫ్యామిలీ మాత్రం ఆయనను ఎప్పటిలాగే దూరం పెడుతుందని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. మంచు విష్ణు ఈ మధ్యకాలంలోనే తన బర్త్డేని జరుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తన అన్న మంచు విష్ణు కి మనోజ్ బర్త్డే విషెస్ చెప్పారు. కానీ విష్ణు మాత్రం ఆయనకు పెట్టిన మిగిలిన సెలబ్రిటీలందరికీ థాంక్స్ చెప్పారు.కానీ సొంత తమ్ముడు పెట్టిన మెసేజ్ కి రిప్లై మాత్రం ఇవ్వలేదు.

అలాగే మంచు విష్ణు(MANCHU VISHNU) కూతుర్లు అరియానా, వివియానా పుట్టినరోజు కు కూడా మనోజ్ ఇద్దరికీ బర్త్డే విషెస్ చెప్పారు. కానీ ఈ విషయంలో కూడా మంచు మనోజ్ స్పందించలేదు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మంచు ఫ్యామిలీలో గొడవలు నిజంగానే ఉన్నాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మనోజ్ ఎంత దగ్గర కావాలని చూసినా కూడా ఫ్యామిలీ వాళ్లు దూరం పెట్టడంతో వీరి మధ్య ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ విషయంలో స్పష్టత రావాలంటే ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ స్పందించాల్సిందే. లేకపోతే మంచి ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో మరిన్ని ట్రోల్స్ రావడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *