Wedding Day! Groom Rana Daggubati is 'ready', poses with father Suresh Babu  and uncle Venkateshప్రస్తుతం బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ షో కి హోస్టుగా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ గా సక్సెస్ గా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సీజన్లో 4 ఎపిసోడ్లు పూర్తికాగా ఈ నాలుగు ఎపిసోడ్లు కూడా మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకోవడం గమనార్హం. కేవలం సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా ఈ షోలో సందడి చేస్తూ ఉండడంతో ఈ షో పై అభిమానుల అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ఐదవ ఎపిసోడ్కి అగ్ర నిర్మాతలైన సురేష్ బాబు, అల్లు అరవింద్ తో పాటు అగ్ర దర్శకులు కే.రాఘవేంద్రరావు ,కోదండరామిరెడ్డి వచ్చారు.

తాజాగా ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడమే కాకుండా ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఎపిసోడ్ ను ఆహా టీం రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో అనేక సినిమా విషయాల గురించి అలాగే హీరోల రెమ్యూనరేషన్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. మీ ప్రొడక్షన్లో సినిమా చేస్తే.. వెంకటేష్ కి రెమ్యునరేషన్ ఇస్తారా అని అడిగారు బాలయ్య బాబు.. అయితే ఈ విషయంపై సురేష్ బాబు స్పందిస్తూ… మా ప్రొడక్షన్లో వెంకటేష్ సినిమా చేస్తే సగం పారితోషకం మాత్రమే ఇస్తాను.. మిగతాది సురేష్ ప్రొడక్షన్ లోకి రాసుకుంటాను.. వెంకటేష్ కూడా ఏమనడు..అడగడు.. అని తెలిపారు సురేష్ బాబు.

ఆస్తి విషయాలపై కూడా బాలయ్య బాబు సురేష్ బాబును ప్రశ్నించగా.. మొదటిసారి ఆయన ఆస్తి పంపకంపై స్పందించడం జరిగింది. సురేష్ బాబు మాట్లాడుతూ.. ఆస్తిని మేము విడగొట్టలేదు .. కానీ ఫుడ్ మాత్రం నేను , వెంకటేష్ సరిగ్గా సగం సగం తీసుకొని తింటాము. లేకపోతే గొడవలు అయిపోతాయి.. భవిష్యత్తులో ఆస్తి పంపకం వస్తే చిల్లిగవ్వ కూడా నేను నా దగ్గర పెట్టుకోను.. నా తమ్ముడికి సరి సమానం పంచుతాను అంటూ అన్నయ్యగా తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు సురేష్ బాబు.

సురేష్ బాబు నిజాయితీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సినిమాల పారితోషకం విషయంలో కూడా ఆయన ఎప్పుడూ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు నటీనటులు అడిగినంత పారితోషకం ఇస్తూ వారి నుంచి మంచి ఔట్పుట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ్ముడు వెంకటేష్ కూడా ఆయనకు అండగా నిలుస్తూ ఉండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *