Actress Soundarya pregnant when she died in helicopter crash?టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అందాల రాసి సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈమె మన మధ్య లేకపోయినా తన అందంతో.. అద్భుతమైన నటనతో.. ఈమె తెరకెక్కించిన సినిమాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయి. ఎంత అందంగా ఉంటుందో అంత సహనంగా కూడా ఉంటుంది. ఎవరిపై అంత త్వరగా వాగ్వాదానికి దిగదని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా సౌందర్య పై ఒక నటుడు షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ విలన్స్ లో ఒకరైన సత్య ప్రకాష్.. విలన్ చేష్టలు ఇలా కూడా ఉంటాయా అనంతగా ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా సాయికుమార్ లాంటి హీరో సినిమాలలో సత్య ప్రకాష్ ఎక్కువగా కనిపించేవారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు.. ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. నటుడిగా స్థిరపడడానికి చాలా కష్టపడ్డారు. తపనతో చిన్న చిన్న వేషాల దగ్గర నుంచి మెయిన్ విలన్ గా ఎదగడం జరిగింది.

ముఖ్యంగా విలన్ పాత్రలు పోషించిన వారందరి కంటే సత్య ప్రకాష్ నటన చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే సత్య ప్రకాష్ మాట్లాడుతూ హీరోయిన్ సౌందర్య తనపై మెగాస్టార్ చిరంజీవికి కంప్లైంట్ చేశారని తెలిపారు సత్య ప్రకాష్.వెంకటేష్ హీరోగా నటించిన పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో హీరోయిన్గా సౌందర్య నటించిన సమయంలో సౌందర్యను లాగి వ్యాన్లోకి ఎక్కించే సీన్ ఉంది..ఆ సీన్ చేసింది సత్య ప్రకాష్. అయితే ఆ సీన్ సినిమాకే మూలమని .. ఆ సీన్ తోనే కథ మొత్తం మారిపోతుంది అని ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత జనాలు బాగా ఆదరించడమే కాదు ఇప్పటికీ ఆ సీన్ గుర్తు పెట్టుకున్నారు.

ఆ తర్వాత చిరంజీవి, సౌందర్య కాంబినేషన్లో చూడాలని ఉంది సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే.. చిరంజీవి గారిని కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో చిరంజీవి, సౌందర్య ఓకే దగ్గర కూర్చున్నారు. నేను వెళ్ళగానే సౌందర్య నావైపు చూపిస్తూ.. నా కెరియర్లో ఒక సినిమాలో ఒక సంఘటన జరిగింది.. దానికి కారణం ఈయనే అని చెప్పగానే.. నేను షాక్ అయ్యాను.. వెంటనే నా వైపు చూసి పెళ్లి చేసుకుందాం సినిమా గురించి అని చెప్పారు సౌందర్య. దాంతో చిరంజీవి గారు నవ్వారు. ఆ తర్వాత నన్ను పిలిచి షూటింగ్ ఎలా వస్తున్నావు అని అడగ గా స్కూటర్ పైన వస్తున్నా అని చెప్పాను. హెల్మెట్ పెట్టుకో.. మంచి నటుడు కూడా అవుతావు అంటూ చిరంజీవి చెప్పినట్టు తెలిపారు సత్య ప్రకాష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *