Truth About Silk Smitha's Life: Forced Marriage, Queen Of Sensuality,  Mysterious Death And Much Moreసాధారణంగా కొంతమంది జీవిత కథలను చూసినట్లయితే నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది అని కూడా అనుమానం కానీ సిల్క్ స్మిత వంటి కొంతమంది తారల గురించి విన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్రాలు కోకొల్లలు అని అనిపించక మానదు. అలాంటి వారిలో సిల్క్ స్మిత కూడా ఒకరు. స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఏలూరు దగ్గర ఉన్న కొవ్వలి స్వగ్రామం. 1960 డిసెంబర్ 2న నిరుపేద రైతు కుటుంబంలో శ్రీరామమూర్తి, నరసమ్మ దంపతులకు జన్మించింది. దగ్గర బంధువు అన్నపూర్ణమ్మ దత్తత తీసుకోవడంతో విజయలక్ష్మి మకాం ఏలూరుకు మారింది. విజయలక్ష్మి కి చిన్నప్పటినుంచి సినిమాల పైన ఇష్టం ఉండడంతో సినిమాలలో రాణించాలనే కోరికతో 18 ఏళ్ల వయసులో తల్లిని వెంటబెట్టుకుని మద్రాస్ చేరుకుంది.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ చాలామంది నిర్మాతలను కలిసి అభ్యర్థించింది. అయితే ఎవరూ కూడా ఈమెకు అవకాశాలను ఇవ్వలేదు. అంతేకాదు ఏ నిర్మాతకి ఆమెలో నిద్రాణంగా ఉన్న నటి కనిపించలేదు. అంతేకాదు నీ మొహం లో గ్లామర్ లేదు నీకు వేషాలు ఇస్తే ఇక అంతే సంగతులు అన్న వారు కూడా ఉన్నారు. మొత్తానికైతే అందరూ కలిసి ఈమె నటిగా పనికిరాదని తేల్చేశారు. మరొకరైతే అవమానాలు తట్టుకోలేక సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. కానీ విజయలక్ష్మి అలాంటి వ్యక్తి కాదు.. చావో రేవో మద్రాస్ లోనే తేల్చుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేసింది. నిజం చెప్పాలంటే హీరోయిన్ కావాల్సిన అందచందాలు కూడా ఆమెకు లేవు.

ఆమె నల్లగా, బొద్దుగా ఉండేది. పైగా మాట్లాడడం కూడా సరిగా వచ్చేది కాదు.కానీ ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ.. మైకం కమ్మించే ఆ కళ్ళు అన్నీ కూడా అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి కానీ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. నిజానికి హీరోయిన్ కు కావలసిన లక్షణాలు నాజూగ్గా ఉండడం, తెల్లగా ఉండడం.. కానీ ఈ రెండూ కూడా లేకపోవడం ఆమె కెరియర్ కు మైనస్ అయింది అయినా ప్రయత్నాలు ఆపలేదు. తన పేరును విజయ గా మార్చుకొని కొన్ని చిత్రాలను గుంపులో గోవిందగా వేషాలు వేసింది. సరిగ్గా అలాంటి సమయంలోనే మలయాళంలో నటించే అవకాశం ఈమెకు లభించింది.

నిజానికి మలయాళ దర్శకు నిర్మాతలకు.. భాషతో, టాలెంట్ తో పనిలేదు. అందాలు ఆరబోయడానికి వెనుకాడని యువతలు మాత్రమే కావాలి. అంతే పూర్తిగా సెక్స్ అప్పీల్ ఉన్న ఆ పాత్ర పోషించడానికి విజయ తయారయింది. తెలుగులో అవకాశాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు పరిధిలో హద్దులు ఎందుకు అనుకుని విజయ తెగించేసింది. విలువలతో పాటు వలువలు కూడా వదిలేసింది. అంతే తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకున్న ఈమెపై తమిళ్ నిర్మాతలు దృష్టిపడింది. అక్కడ సిల్క్ స్మిత గా పేరు మార్చుకొని అతి తక్కువ సమయంలోనే తెలుగు నిర్మాతలు కూడా ఈమె కోసం క్యూ కట్టేలా చేసుకుంది. అలా ఒక్కో డాన్స్ కోసం ఏకంగా 50వేల రూపాయలు డిమాండ్ చేసినా ఓకే అని నిర్మాతలు ఆమెను తీసుకోవడం జరిగింది. అలా.. 1981 నుండి 1996 వరకు సిల్క్ స్మిత కెరియర్ ఉజ్వలంగా వెలిగిపోయింది. టాలెంట్ ఉండాలి కానీ కలర్ తో పనిలేదు అని నిరూపించింది సిల్క్ స్మిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *