Salman Khan's ex-girlfriend Somy Ali takes major potshot at actor, calls  him 'Sadistic sick' | People News | Zee Newsబాలీవుడ్ కండల వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన కింద ఎంతోమంది అమ్మాయిలు నలిగిపోయారని వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఐశ్వర్య రాయ్ ని మొదలుకొని నిన్నటి తరం సోమీ అలీ వరకు చాలామంది అమ్మాయిలు సల్మాన్ ఖాన్ దాడులకు ఇబ్బంది పడినవారే .. తాజాగా సల్మాన్ ఖాన్ పై ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ దారుణ కామెంట్లు చేయడంతో ప్రస్తుతం మళ్ళీ ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. 1990 సంవత్సరం మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ ప్రేయసిగా బాగా పాపులారిటీని తెచ్చుకున్న సోమి అలీ పాకిస్థాన్లో పుట్టి అమెరికాలో స్థిరపడింది. సల్మాన్ ఖాన్ కి వీరాభిమాని. సల్మాన్ ఖాన్ కోసమే ఇండియా వచ్చిన ఈమె మోడలింగ్ పట్ల ఆసక్తి ఉండడంతో చివరికి హీరోయిన్ అయింది.

1993లో కృష్ణ అవతార్ సినిమా ద్వారా హీరోయిన్ అయినప్పటికీ అంతకుముందే సల్మాన్ తో రిలేషన్ మొదలైనట్లు సమాచార. 1994లో ఎక్కువ సినిమాలు చేసిన ఈమె 1997లో ఇండస్ట్రీకి దూరమై అమెరికాలోనే స్థిరపడిపోయింది. ముఖ్యంగా ఏడేళ్లకు పైగా ప్రేమించుకున్న వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచింది అని రిలేషన్ లో ఉన్నారు అని, పెళ్లి కూడా చేసుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగింది. కానీ సోమీ అలీతో సల్మాన్ ఖాన్ కి బ్రేకప్ అయిపోయింది. సోమీ తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అయితే పరిశ్రమను వదిలేసి పోవడానికి కూడా కారణం సల్మాన్ అనే ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంటుంది.

పలు సందర్భాలలో విమర్శలు చేసిన సోమి అలీ తాజాగా మరొకసారి విరుచుకుపడింది. సల్మాన్ పై ఆమె దారుణమైన ఆరోపణలు చేసింది. స్త్రీలను కొట్టడం అతడి అలవాటు .. అతడు ఒక మగ ఉన్మాది.. మగ పంది.. నన్ను సిగరెట్ల తో కాల్చి వేధించాడు. అతడు యానల్ సెక్స్ కోరుకుంటాడు.. లైంగిక వేధింపులకు పాల్పడతాడు.నాలాగే ఇంకొంతమంది అమ్మాయిలను కూడా హింసించారు. కొందరు నాతో ఈ విషయాన్ని చెప్పుకున్నారని కూడా సీరియస్ అలిగేషన్స్ చేసింది.

సల్మాన్ ఖాన్ పై తాజాగా సోమీ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఐశ్వర్యరాయ్ తో కూడా లవ్ ఎఫైర్ నడిపిన సల్మాన్ ఖాన్ ఆమెను మరింత వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తాగిన మైకంలో ఐశ్వర్యరాయ్ అపార్ట్మెంట్ ముందు అర్ధరాత్రి అల్లరి చేసిన సల్మాన్ ఖాన్ పై ఆమె తండ్రి కంప్లైంట్ కూడా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *