`అల వైకుంఠపురంలో` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram srinivas).. లాంగ్ గ్యాప్ తీసుకుని త‌న త‌దుప‌రి చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా కనిపించబోతున్నారు. సెకండ్ హీరోయిన్గా యంగ్ సెన్సేషన్ శ్రీలీల క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. అతడు, ఖలేజా వంటి చిత్రాల అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

త‌మ‌న్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని గత కొద్దిరోజుల నుంచి నెట్టింట‌ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉండవు. కానీ ఇటీవల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ హవా బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్రివిక్ర‌మ్‌ సైతం మహేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడని.. ఆ సాంగ్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(rashmika mandanna) కనిపించబోతోందని జోరుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుత స్టార్ హీరోయిన్లు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తూ.. భారీగా రెమ్యున‌రేష‌న్ ను తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో రష్మిక సైతం చేరబోతోందట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మహేష్(mahesh) సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం రష్మిక అందుకుంటున్న పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకు ఈ అమ్మ‌డు ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందట. అంతకంటే ఒక్క రూపాయి తగ్గిన ఐటమ్ సాంగ్ లో నటించన‌ని చెప్పిందట. ఇక రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉండటం వల్ల ఆమె అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ ఓకే చెప్పారంటూ టాక్ నడుస్తోంది.

ఏదేమైనా ఒక్క ఐటెం సాంగ్ అన్ని కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ నేప‌థ్యంలోనే ఆమెను కొందరు విమర్శిస్తున్నారు. ఐటమ్ సాంగ్ రే ఐదుకోట్లా.. ర‌ష్మికా ఇది మరీ టూ మచ్ గా లేదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ర‌ష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఈ అందాల భామ తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా `పుష్ప 2` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో విజయ్ దళపతి(vijay thalapathy)తో ఈమె చేసిన `వారసుడు` వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. మరోవైపు బాలీవుడ్ లో రష్మిక నటించిన `మిష‌న్‌ మజ్ను` విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రణ‌బీర్ కపూర్ తో `యానిమల్` అనే సినిమా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *