దిల్ రాజు(dil raju) మొదట డిస్ట్రిబ్యూషన్ రంగం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఈయన నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమాతో ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ గా పరిచయమయ్యాడు.దాంతో ఈయన పేరును దిల్ రాజు అని పెట్టేశారు. దిల్ రాజు ప్రస్తుతం ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఇండస్ట్రీని శాసించే లెవెల్ లో ఉన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా సినిమాలు తెరకెక్కించి డబ్బు కోల్పోయారు.

కానీ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ(tholiprema) సినిమాతో ఈయన పెట్టిన డబ్బులకు రెట్టింపు ఆదాయం వచ్చింది. దాంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి అప్పటినుండి ఇప్పటివరకు వరుస సినిమాలు తెరకెక్కిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్ గా మారారు. అయితే ఇండస్ట్రీలో సాఫీగా సాగుతున్న దిల్ రాజు లైఫ్ లో ఈ మధ్య కాస్త ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే దిల్ రాజు చిన్న చిన్న సినిమాలను అలాగే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రాకుండా చేస్తున్నారు అంటూ ఆయన మీద విమర్శలు చేస్తున్నారు.

అయితే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న దిల్ రాజు పవన్ కళ్యాణ్ తన గురించి చెప్పిన ఓ సీక్రెట్ ని రివీల్ చేశారు.వకీల్ సాబ్(vakeel saab) సినిమాల రిలీజ్ టైం లో చాలా గొడవలు అయ్యాయి. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమాని వైసిపి ప్రభుత్వం విడుదలవ్వకుండా అడ్డుపడింది అంటూ పవన్ కళ్యాణ్ అప్పుడు వైసిపి ప్రభుత్వం పై చాలా మండిపడ్డారు. అయితే ఓ మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. వకీల్ సాబ్ సినిమా విడుదల చేసే టైంలో వివాదాలు రావడం వల్ల నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి ఈ వివాదాన్ని పరిష్కరిద్దాం అని చెప్పాను.

కానీ పవన్ కళ్యాణ్ (pawan kalyan)మాత్రం ఆయన మీ నాయకుడే కదా వెళ్లి అడగండి అంటూ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోజు మీ నాయకుడే కదా వెళ్లండి అని అనడం వల్లే నా గురించి ఇండస్ట్రీలో చాలామందికి ఓ నిజం తెలిసింది. అదేంటంటే నేను రెడ్డి అనే నిజం.. ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామందికి నేను రెడ్డి అనే విషయం తెలియదు.కానీ పవన్ కళ్యాణ్ వల్ల ఈ విషయం చాలామందికి తెలిసింది. ఇక నేను రెడ్డి అనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు.. అంటూ పవన్ కళ్యాణ్ తన గురించి చెప్పిన సీక్రెట్ ని బయట పెట్టారు దిల్ రాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *