జాతి రత్నాలు (JATHI RATHNALU)సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అయిపోయారు అనుదీప్ కె.వి. ఈయన మొదటగా పిట్టగోడ సినిమా తీసినప్పటికీ ఆ సినిమా అంతా విజయవంతం కాకపోవడంతో డైరెక్టర్ గా మంచి పేరు రాలేదు. కానీ జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యనే ఆయన తీసిన ప్రిన్స్ మూవీ తో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక డైరెక్టర్ అనుదీప్ సోషల్ మీడియాలోని మీమర్స్ కి ఆల్ టైం మెటీరియల్ గా అయిపోయాడు.

ఈయన ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా వారు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబులు ఇస్తూ వస్తున్నాడు. అంతేగాక తన మాటలతో అందరిలో నవ్వులు పూయిస్తున్నాడు. ఈ డైరెక్టర్ కేవలం మాటలతోనే కాకుండా తన బిహేవియర్ తో ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పటివరకు ఈయన ఏం చదువుకున్నారు అనేది ఎవరికి తెలియదు. కానీ ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా ఆలోచించకుండా టక్కున తనకు తోచిన జవాబు చెబుతూ అందరూ గుర్తుండి పోయేలా బిహేవ్ చేస్తూ ఉంటారు.

ఈయన వేసే పంచ్ ల వల్ల ఎంతోమంది ఈయనకు అభిమానులు అయ్యారు. ఇక ఈ విషయం పక్కన పెడితే..ఈ డైరెక్టర్ ని గనుక పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ కూడా చెప్పులు వేసుకోడు. అయితే అలా చెప్పులు ఎందుకు వేసుకోరు అని అడిగినా కూడా దానికి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నని ఎప్పుడూ దాటవేస్తూ ఉంటారు. ఇక ఆయన చెప్పులు వేసుకోకపోవడం వెనుక ఉన్న ఒక రహస్యాన్ని ఆయన సన్నిహితులు చెప్పారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

డైరెక్టర్ అనుదీప్(ANUDEEP K.V) క్లింట్ ఒబెర్ పుస్తకం రాసిన ఎర్తింగ్ అనే పుస్తకాన్ని చదివి అందులో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాడట. అదేంటంటే సింథటిక్ వచ్చాక మనిషికి భూమికి మధ్య ఉన్న బాండింగ్ మిస్ అవుతుందని భావించి ఆయన అప్పటినుండి చెప్పులు వేసుకోవడం మానేశాడట. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ అందరూ ఈయన చెప్పులు వేసుకోకపోవడం వెనక ఇంత రహస్యం దాగి ఉందా అంటూ మాట్లాడుకుంటున్నారు.అలాగే ఈ మధ్యనే డైరెక్టర్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందంటూ బయటపెట్టారు. ఇక తనకున్న వ్యాధిపై కూడా సినిమా తెరకెక్కించే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *