కత్రినా కైఫ్(Katrina Kaif).. బాలీవుడ్ బిజీ హీరోయిన్ల లిస్టులో ఈమె ఒకరు. ఈ అందాల భామ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి. స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. అలాగే తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. ఇక గత ఏడాది డిసెంబర్లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె మేరీ క్రిస్‌మస్, టైగర్ 3(tiger 3) సినిమాల్లో నటిస్తోంది. అలాగే షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా భర్తతో విదేశాలకు చెక్కేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

విక్ట‌రీ వెంకేష్‌ హీరోగా తెరకెక్కిన `మల్లీశ్వరి(malleswari)` సినిమాతో కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే నట‌సింహం నందమూరి బాలకృష్ణకు జోడిగా `అల్లరి పిడుగు` సినిమాలో నటించింది. ఈ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ టాలీవుడ్ లో కనిపించలేదు. ఇక్కడి దర్శకనిర్మాతలు, హీరోలు ఆమె వైపు క‌న్నెతి కూడా చూడలేదు అసలు ఎందుకు కత్రినా కైఫ్ ను టాలీవుడ్ ఎందుకు బ్యాన్ చేసింది అన్న ప్రశ్న చాలా మంది మదిలో ఉంది.

అయితే అందుకు కొన్ని కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాకు ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్‌ను తీసుకుంద‌ట‌. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మొదటి సినిమాకే ఆ రేంజ్ లో డిమాండ్ చేయడం నిర్మాతలకు మింగుడు పడలేద‌ట‌. అలాగే షూటింగ్‌కు ఎప్పుడు ఆలస్యంగా వచ్చేదని.. ఆమె వల్ల‌ దర్శకులు, తోటి నటీనటులు ఇబ్బంది పడాల్సి వచ్చేదని వెంకటేష్ బ్రదర్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(suresh babu) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కత్రినా హైట్ కూడా పెద్ద సమస్యగా మారింది. టాలీవుడ్ లో చాలామంది హీరోలు కత్రినా హైట్ కు మ్యాచ్ అయ్యేవారు కాదు. ఈ కారణాల వల్లే టాలీవుడ్ కత్రినా కైఫ్ ను పక్కన పెట్టేసిందని టాక్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *