బాలకృష్ణ(balakrishna) అన్స్టాపబుల్ సీజన్ 2 ద్వారా ఎంతోమంది ప్రముఖులను షోకి ఆహ్వానించి వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నారు. ఈ నేపద్యంలోనే తాజాగా ఈ షో కి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ లైనా దగ్గుపాటి సురేష్ బాబు, అల్లు అరవింద్ లు పాల్గొన్నారు. ఇక వీరిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో మహానటి సావిత్రి అంత పేరు సంపాదించగల హీరోయిన్ ఎవరు అని బాలకృష్ణ అడగగానే.. ఇద్దరు నిర్మాతలు ఒకరికి తెలియకుండా ఒకరు సమంతా అని రాశారు.

ఇద్దరం ఒకే పేరు రాశాం కదా అని ఆనందం కూడా వ్యక్తం చేశారు. ఇక దగ్గుబాటి సురేష్ బాబు మాత్రం సమంత (samantha)ను ఓ రేంజ్ లో పొగిడారు. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత మాత్రమే మహానటి సావిత్రి అంతటి స్థాయికి చేరగలదు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అయితే ఈ విషయం పక్కన పెడితే..సమంత గురించి దగ్గుబాటి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే అక్కినేని నాగచైతన్య(nagachaithanya) ను సమంత పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాక సమంతకు అక్కినేని ఫ్యామిలీతో అలాగే దగ్గుబాటి ఫ్యామిలీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అంతేకాకుండా సమంత మయాసైటిస్ అనే వ్యాధి బారిన పడినప్పుడు కూడా అక్కినేని అఖిల్ అలాగే సుమంత్, సుశాంత్ వంటి హీరోలు కూడా ఆమెకు సపోర్టుగా నిలిచారు. అలాగే దగ్గుబాటి ఇంట్లో నుండి వెంకటేష్ కూతురు అశ్రీత కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్ రూపంలో చెప్పింది.

అంతేకాకుండా తాజాగా సురేష్ బాబు(suresh babu) కూడా సమంతను పొగడడం విశేషం. అయితే ఈ విషయంలో అక్కినేని అభిమానులు మాత్రం దగ్గుబాటి సురేష్ బాబు మీద కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాగచైతన్యకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న సమంతకు ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయడం ఏం బాగాలేదు అంటూ అక్కినేని అభిమానులు దగ్గుపాటి ఫ్యామిలీ పై కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ సమంత అభిమానులు మాత్రం ఈ విషయం తెలిసి తెగ మురిసిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *