పవన్ కల్యాణ్ సెట్‌లో అలా సిగ్గుపడేవాడు.. సీనియర్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు |  Manalokamటాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ కొనసాగించిన వారిలో వై. విజయ కూడా ఒకరు. ఇప్పుడు ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.ఈమె డాన్స్ నేర్చుకోవటానికి చెన్నై వెళ్ళిందట. అక్కడ వెంపటి చిన్న సత్యం గారి కంట పడింది. దాంతో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇక వై.విజయది జన్మస్థలం కర్నూల్.. కానీ పెరిగిందంతా కడపలో.. ఈమె దాదాపు 1000 సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో హీరోయిన్గా మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఈమెకి చాపల పులుసు అనే పాత్ర బాగా అచ్చు వచ్చింది. ఆ ఒక్క పాత్రతో దాదాపు 100 సినిమాలు చేసింది.

ఇక అప్పట్లో ఫుల్ బిజీగా ఉండే ఆర్టిస్టుల్లో వై విజయ కూడా ఒకరని చెప్పవచ్చు. ఆ సమయంలోనే ఒకే రోజు ఐదు షూటింగులు ఉండటంతో చాలా టెన్షన్ పడ్డారట. ఆ ఐదు ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ వస్తే తీయాలంటేనే భయమేసింది అంటూ చెప్పారు. పెద్ద ప్రొడక్షన్స్ సినిమాలే కావటం వల్ల అన్ని ఒకే రోజే ఉండటంవల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది. మొదటగా డేట్స్ ఇచ్చింది తేనె మనసులు సినిమాకి.. అందుకని మొదటగా ఆ సినిమా షూటింగ్ కి వెళ్లారట.

కానీ అక్కడ ఫ్లైట్ మిస్ అయ్యి లేట్ అయ్యిందట. ఉదయాన రవిరాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉన్న ఆలస్యం అవ్వడంతో బాగా టెన్షన్ పడ్డాను అంటూ చెప్పుకొచ్చారు వై విజయ. కానీ పొద్దున షూటింగ్ అయితే నేను మధ్యాహ్నానికి వెళ్లాను. అప్పుడు ఆయన ఏమంటారో అన్న భయంతో కార్ లోనే ఉండిపోయాను రవి రాజా పినిశెట్టితో మొదటి సినిమా కావటంతో టెన్షన్ పడ్డానని చెప్పారు. కానీ ఆయన ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు షూటింగ్ కి రమ్మని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారట విజయ. ఇక అలా ఐదు షూటింగ్ లు ఉన్న సమయంలో ఒక్క షూటింగ్ కి వెళ్లలేకపోయారట.

ఇక వై విజయ గారు అంత గొప్ప ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న కూడా ఏనాడు రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయలేదట. తన భర్త ఒక మాట చెబుతుండేవాడట. అదేమిటంటే నెమ్మదిగా పైకి రావాలి కానీ వేగంగా ఎదిగి కిందికి పడిపోకూడదని చెప్పేవారట.. సినిమా ఆదాయం విషయానికి వస్తే ఎక్కువ రోజులు ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చేలా చేసుకున్నారట. అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఈమె ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *